Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి తులసి ఆకులను నీటిలో మరిగించి తాగితే?

Acidity
Webdunia
గురువారం, 27 జూన్ 2019 (13:23 IST)
వేసవిలో మజ్జిగ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మజ్జిక శరీరానికి చలువ చేస్తుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. మసాలాలు తిన్నప్పుడు తరచుగా కడుపులో వికారం, గ్యాస్, అసిడిటీ వస్తుంది. దాని నుండి తక్షణమే ఉపశమనం పొందాలంటే మజ్జిగ తప్పనిసరిగా త్రాగాలని చెబుతున్నారు నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్‌ ఆసిడ్‌ అనే ఆమ్లం కడుపులోని గ్యాస్‌ సమస్యను తగ్గిస్తుంది. 
 
పచ్చి తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి చల్లార్చి త్రాగాలి. ఇలా రోజూ త్రాగితే గ్యాస్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు. అలాగే అసిడిటీకి కొబ్బరి నీరు దివ్యౌషధం, కొబ్బరి నీరు త్రాగితే తక్షణమే శక్తి లభిస్తుంది. గ్యాస్ సమస్యను తగ్గించడానికి బెల్లం ఎంతగానో దోహదపడుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం కూడా లభిస్తుంది. 
 
ఇంకా చెప్పాలంటే, ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక స్పూన్‌ సోంపు వేసి కాసేపు అలానే ఉంచాలి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిలో స్పూన్ తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే అసిడిటీకి పరిష్కారం లభించినట్లేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments