Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంపంగి నూనె వుంది రాజా... మహా సమ్మ సమ్మగుంటాది రాజా...

పువ్వులలో సంపంగిలకు ప్రత్యేక స్థానముంది. నాలుగు సంపంగి పువ్వులను తీసుకుని అందులో స్పూన్ ఆలివ్ ఆయిల్ చేర్చి పేస్ట్‌లా చేసుకుని ఆ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చును.

Webdunia
బుధవారం, 30 మే 2018 (10:15 IST)
పువ్వులలో సంపంగిలకు ప్రత్యేక స్థానముంది. నాలుగు సంపంగి పువ్వులను తీసుకుని అందులో స్పూన్ ఆలివ్ ఆయిల్ చేర్చి పేస్ట్‌లా చేసుకుని ఆ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చును. అరకేజీ కొబ్బరి నూనెలో 50 గ్రాముల సంపంగి పువ్వులను చేర్చి బాగా మరిగించిన దానినే తైలం అంటారు. ఈ తైలాన్ని తల నుంచి పాదాల వరకు రాసుకుని మర్దన చేసుకుంటే ఒంటి నొప్పులు వంటి చికాకులు తొలగిపోతాయి.
 
ఒక గ్లాసులో నీటిని తీసుకుని అందులో 5 సంపంగి పువ్వులను వేసి సగానికి వచ్చేంత వరకు మరిగించిన నీటిని ఉదయం, సాయంత్రం పూట తీసుకున్నట్లైతే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అలాగే వంద గ్రాముల సంపంగి పువ్వులలో 20 గ్రాముల పెసరపప్పును చేర్చి పౌడర్‌లా తయారుచేసుకుని స్నానం చేసేటప్పుడు ఈ పౌడర్‌ను ఉపయోగిస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. 
 
సంపంగి పువ్వులలో కొంచెం నీటిని చేర్చి రుబ్బుకోవాలి. అలాచేసిన తరువాత ఆ మిశ్రమాన్ని కంటి చుట్టూ పూతలలా వేసుకుని కాసేపాగాక కడిగేసుకుంటే కంటికి చల్లదనం లభిస్తుంది. మచ్చలు, మెుటిమలకు రెండు సంపంగి పువ్వులను తీసుకుని అందులో కొబ్బరి పాలు రెండు స్పూన్స్ కలిపి బాగా రుబ్బుకుని ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
పిడికెడు సంపంగి పువ్వుల్ని వేడిచేసిన నీటిలో వేసుకుని వారానికి రెండు సార్లు ఆవిరిపడితే చర్మ కాంతి పెరుగుటకు సహాయపడుతుంది. పాలుకాచిన తరువాత అందులో సంపంగి పువ్వులను వేసి ఆరనివ్వాలి. ఇందులో చక్కెర లేదా బెల్లం వేసి బాగా కలుపుకుని రోజు ఒక గ్లాసు మోతాదులో తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది. అలాగే 200 గ్రాముల నువ్వుల నూనెలో 50 గ్రాముల సంపంగి పువ్వుల్ని వేసి మరిగించి ఆ నూనెను పాదాలకు రాసుకుంటే పగుళ్ళ నుంచి ఉపశమనం పొందవచ్చును. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

తర్వాతి కథనం
Show comments