Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంతిపూల నూనెను తీసుకుంటే ఏం జరుగుతుంది?

బంతిపూల వాడకం ఈమధ్యకాలంలో కాస్త ఎక్కువగానే ఉంది. బంతిపూలకి క్రిమికీటకాలు దూరంగా ఉంటాయి. పైగ ఇవి బరువుగా కూడా ఉంటాయి. అలంకారం కోసం, ఆరోగ్యరీత్యా వీటిని ప్రతి సందర్భంలోనూ వినియోగిస్తూనే ఉంటారు. బంతిపూలన

Advertiesment
Health
, సోమవారం, 28 మే 2018 (14:56 IST)
బంతిపూల వాడకం ఈమధ్యకాలంలో కాస్త ఎక్కువగానే ఉంది. బంతిపూలకి క్రిమికీటకాలు దూరంగా ఉంటాయి. అలంకారం కోసం, ఆరోగ్యరీత్యా వీటిని ప్రతి సందర్భంలోనూ వినియోగిస్తూనే ఉంటారు. బంతిపూలను ఆంగ్లంలో మేరీగోల్డ్ అంటారు. వీటిని తినేందుకు ఏమంత రుచిగా ఉండకపోయినప్పటికి, కుంకుమపువ్వుకి బదులుగా వాడుతుంటారు. దుస్తులకు రంగులనిచ్చే అద్దకాలలోనూ వీటిని వినియోగిస్తారు. ఇక బంతిపూల ఆరోగ్యవిశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 
బంతిపూల రంగుకి వాటిలో ఉండే కెరోటినాయిడ్స్ అనే రసాయనమే కారణం. ఇది యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలోనీ రోగనిరోధక శక్తికే కాకుండా క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యాలు తలెత్తకుండా కాపాడుతుంది. బంతిపూలు చర్మానికి చేసే మేలు వందల సంవత్సారాల నుంచి గ్రీక్, రోమన్, భారతీయ వైద్యాలలో బంతిపూల నూనెకి గొప్ప ప్రాధాన్యతని ఇచ్చారు. ఈ నూనె చర్మానికి మృదుత్వాన్నీ, కాంతిని అందిపజేస్తుంది. చర్మ సమస్యలకి దివ్యౌషధంగా పనిచేస్తుంది. దెబ్బతిన్ని చర్మం మీద కణజాలం తిరిగి వృద్ధి చెందేందుకు, రక్తప్రసరణకు సహాయపడుతుంది. చర్మంలోని తేమని నిలిపివేసెందుకు బంతినూనె చాలా ఉపయోగపడుతుంది.
 
చర్మం తెగినప్పుడు, కాలిన గాయాలకి, చర్మవ్యాధులలోను, విష పురుగులు కుట్టినప్పుడు ఇలా రకరకాల సందర్భాలలో బంతిపూలతో చేసిన నూనె లేదా అయి‌ల్‌మెట్ అద్భుతంగా పనిచేస్తుంది. బంతిపూల నుంచి తీసిన నూనెను తీసుకోవడం వలన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. కేవలం బంతిపూలే కాదు దాని ఆకులూ, గింజలూ, కాడలలో కూడా విశేషమైన ఔషధగుణాలు ఉన్నాయి. అందువలనే వీటిని అనేక ఔషధాలలో వాడుతుంటారు.
 
బంతిపూల నుంచి తీసే నూనెలో యాంటీవైరస్, యాంటీసెప్టిక్, యాంటీఫంగల్, యాంటీబయాటిక్ గుణాలు ఉంటాయి. అందుకోసం శరీరంలోని అనేక అనారోగ్యాలలో ఇవి అద్భుతమైన ఫలితాలనందిస్తాయి. కండ్ల కలక దగ్గర్నుంచీ మొలల వరకూ వీటిని అనేక సందర్భాలలో వినియోగిస్తారు. బంతిపూలలో ఇన్ని సుగుణాలు ఉన్నందు వలనే వీటితో టీ కాచుకుని త్రాగుతారు.
 
బంతిపూల జోలికి క్రిమికీటకాలు రావు కాబట్టి ఈ చెట్లని పెరట్లో పెంచమని వైద్యులు సూచిస్తున్నారు. ఇంట్లో దోమల నుంచి విముక్తి పొందాటనికి బంతి నుంచి తీసిన రసాన్ని వినియోగించటం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాఫీ పొడి రుచికే కాదు... కంటికి, కేశాలకు కూడా....