Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవిలో ముల్లంగిని తీసుకుంటే ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసా?

వేసవిలో ముల్లంగి తీసుకుంటే శరీరానికి చలవచేస్తుంది. వేసవిలో శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడెందుకు ముల్లంగిని వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు తీసుకోవడం ద్వారా వేసవితాపం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకో

వేసవిలో ముల్లంగిని తీసుకుంటే ఎలాంటి మేలు కలుగుతుందో తెలుసా?
, శనివారం, 26 మే 2018 (10:48 IST)
వేసవిలో ముల్లంగి తీసుకుంటే శరీరానికి చలవచేస్తుంది. వేసవిలో శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడేందుకు ముల్లంగిని వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు తీసుకోవడం ద్వారా వేసవితాపం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముల్లంగిలో విటమిన్ ఎ, సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి న్యూట్రీషన్స్ ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్థులకు ముల్లంగి ఎంతోమేలు చేస్తుంది. డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది.
 
ముల్లంగిని చాలామంది ఆహారానికి దూరంగా పెట్టేస్తుంటారు. ఎందుకంటే దీని గురించి సరైన అవగాహన లేకపోవడమే అందుకు ముఖ్యకారణం. నిజానికి ముల్లంగిలో ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
 
ముల్లంగిన మన డైలీ డయట్‌లో చేర్చుకోవడం వల్ల కోలన్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్‌లను రాకుండా కాపాడుతుంది. ముల్లంగిలో శరీరాన్ని డిటాక్సిఫైచేయడానికి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడి, యాంతోసినిన్ వలన యాంటిక్యాన్సర్ ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. ముల్లంగిలో ఉండే విటమిన్ సి, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి కాప్లెక్స్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
మూత్రపిండాల వ్యాధుతలను నియంత్రిస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలో విషాలను తొలగించడానికి రక్తాన్ని శుభ్రపరచడానికి సహాయపడుతుంది. మూత్రపిండాలు సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతుంది. ముల్లంగిలో ఉండే యాంటీప్యూరిటిక్ గుణాలు క్రిమికీటకసంహరిణిగా పనిచేస్తుంది. తేనెటీగలు, కందిరీగలు మొదలగునవి కుట్టినప్పుడు నొప్పి, వాపు ఉన్న ప్రదేశంలో ముల్లంగి రసాన్ని అప్లై చేయడం వల్ల తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. 
 
ముల్లంగి చెడు శ్వాసను నివారస్తుంది. జీవక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. తలనొప్పు, ఎసిడిటిని తొలగిస్తుంది. గొంతునొప్పిని నివారిస్తుంది. ముల్లంగి ఆకలిని వృద్ధి చేస్తుంది. అలాగే నోటిశ్వాసను తాజాగా ఉంచుతుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. కడుపులో మంట, తలనొప్పి, దగ్గుని తగ్గిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కంటికి మేలు కలిగించే వంటకాలు... మీ కోసం...