Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యోదయం అయినా నిద్రలేవకపోతే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (22:14 IST)
ఆయుః అంటే జన్మ-మృత్యు పర్యంతం జీవితంలో వచ్చే అన్ని అంశాలు. వేదం అంటే జ్ఞానం. ఆయుర్వేదం అనేది ఆయుష్షు విజ్ఞానాన్ని తెలిపేది. ఇది మనిషి జీవితంలో ఎలా జీవించాలి అనే దానిని తెలుపుతుంది. ప్రకృతి పరంగా మనిషి ఎలా జీవించాలనేది ఈ శాస్త్రం చెబుతుంది. 

సమతుల్యమైన ఆహారం, ఆలోచనలు, నిద్ర, మైథునం తదితర అంశాలను ఆయుర్వేద బోధిస్తుంది. ఇందులో మనిషి ఏయే పనులు చేయాలి, ఏయే పనులు చేయకూడదు అనే అంశాలను తెలుపుతుంది. ఆయుర్వేదం ద్వారా రోగులకు రోగాల నుంచి ఎలా ముక్తి పొందాలి. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపే ఆరోగ్యవంతులు మరింత ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలను తెలిపేదే ఆయుర్వేదం.
 
ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం, జబ్బులతో కూడుకున్న రోగి ఆరోగ్యాన్ని మరింతగా నయం చేయడమే ఆయుర్వేద వైద్య విధానమని ఆయుర్వేద వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయుర్వేద వైద్యంలో తెలిపిన కొన్ని ప్రాథమిక అంశాలను మనిషి ప్రతి రోజు పాటిస్తుంటే నిత్యం ఆరోగ్యవంతునిగా జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయుర్వేద చికిత్సా విధానంలో ప్రాతఃకాలం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా సమయాన్ని గడపాలి, దీని కొరకు మనిషి తన దినచర్యను ఎలా పాటించాలనేది ఇందులో ప్రధాన అంశాలు.
 
ప్రాతఃకాలం నిద్ర నుండి మేల్కొనాలిః సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనుకునే వ్యక్తులు ప్రాతఃకాలం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. ఈ సమయంలో నిద్రలేచే వ్యక్తులు ఆరోగ్యవంతులుగా ఉంటారు. విద్య, బలం, తేజస్సు, ధనం సమృద్ధిగా ఉంటాయి. ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతుంటారో వారి ఆయుష్షు క్షీణించడంతో పాటు శరీరంలోని శక్తి నశిస్తుంది. ఇలాంటి వ్యక్తులు రకరకాల జబ్బులతో బాధపడుతుంటారని ఆయుర్వేద వైద్యం చెబుతోంది.
 
ఉషఃపానం: ప్రాతఃకాలం నిద్రలేచిన తర్వాత మలమూత్రాదులను విసర్జించే ముందు చల్లటి నీటిని సేవించాలి. రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీటిని భద్రపరచుకోవాలి. నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర లేచిన తర్వాత కనీసం అరలీటరు వీలైతే ఒక లీటరు నీటిని సేవిస్తే మరీ మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇలా నీటిని సేవించడం వలన శరీరంలోనున్న కఫం, వాయు, పిత్త దోషాలు నశిస్తాయి. దీంతో వ్యక్తి బలశాలి, దీర్ఘాయుష్మంతుడుగా మారుతాడు. ఉదరం పూర్తిగా శుభ్రపడుతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments