Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2020 : చావో రేవో తేల్చుకోనున్న రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్

Advertiesment
IP 2020
, గురువారం, 22 అక్టోబరు 2020 (17:04 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 పోటీల్లో భాగంగా గురువారం మరో కీలకమైన మ్యాచ్ (40వ మ్యాచ్) జరుగనుంది. ప్లేఆఫ్ రేసులో నిలబడాలంటే గెలిచి తీరాల్సిన కఠిన పరీక్ష ఇరు జట్లకు నెలకొనివుంది. ఇందులోభాగంగా, దుబాయ్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ తలపడనుంది.  ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌సేన అసమాన్య ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.
 
రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో ఆరో స్థానంలో ఉండగా.. సన్‌రైజర్స్‌ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ గెలిస్తే పాజిటివ్‌ నెట్‌రన్‌రేట్‌ కారణంగా టాప్-4కు చేరుకుంటుంది. హైదరాబాద్‌ ప్లేఆఫ్‌ బెర్త్ దక్కించుకోవాలంటే చివరి 5 మ్యాచ్‌ల్లో కనీసం నాలుగింట్లో గెలిచి తీరాల్సివుంది. 
 
ఇకపోతే, రాజస్థాన్ జట్టులో జోస్‌ బట్లర్‌, స్టీవ్‌ స్మిత్‌ ఫామ్‌లో ఉండగా, రాహుల్‌ తెవాటియా బ్యాట్‌, బంతితో కీలక సమయాల్లో విజృంభిస్తుండగా ఆర్చర్‌, కార్తీక్‌ త్యాగీ బంతితో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నారు.
 
అలాగే, సన్‌రైజర్స్‌ జట్టులో ఆశలన్నీ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌పైనే పెట్టుకుంది. మిడిలార్డర్‌ వైఫల్యంతో గెలవాల్సిన మ్యాచ్‌లను చేజేతులా కోల్పోతున్నది. బౌలర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నారు. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ఇరుజట్లకు ప్రతీ మ్యాచ్‌ కీలకం కావడంతో పోరు రసవత్తరంగా సాగనుంది.  
 
కాగా, ఈ రెండు జట్లూ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లూ మొత్తం 12 మ్యాచ్‌లలో తలపడగా రాజస్థాన్, హైదరాబాద్ జట్లు తలా ఆరేసి మ్యాచ్‌లలో విజయం సాధించాయి. గత సీజన్‌లో ఈ రెండు జట్లు తలపడినపుడు హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి, విజయం సాధించింది. 
 
ఇరు జట్ల అంచనా... 
రాజస్థాన్ రాయల్స్ : బెన్ స్టోక్స్, రాబిన్ ఊతప్ప, సంజూ శాంసన్, స్టీవెన్ స్మిత్, జోస్ బట్లర్, రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, జఫ్రా అర్చర్, శ్రేయాస్ గోపల్, అకింత్ రాజ్‌పుత్ లేదా జయదేవ్ ఉనాద్కత్, కార్తిక్ త్యాగి. 
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ : డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే, కానే విలియమ్సన్ లేదా మహ్మద్ నబి లేదా ఫాబియన్ అలెన్ లేదా జాసన్ హోల్డర్, ప్రియాం గార్గ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, బాసిల్ థంపి లేదా ఖలీల్ అహ్మద్, టి నటరాజన్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంజిదా ఇస్లామ్ పెళ్లి కూతురు గెటప్‌లో బ్యాట్ పట్టి..?