Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#IPL2020: ధోనీ-పరాగ్‌ల మధ్య ఆసక్తికరమైన స్టోరీ.. ఏంటది..?

Advertiesment
#IPL2020: ధోనీ-పరాగ్‌ల మధ్య ఆసక్తికరమైన స్టోరీ.. ఏంటది..?
, శుక్రవారం, 16 అక్టోబరు 2020 (14:04 IST)
MS Dhoni-Riyan Parag
చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ.. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌లకు చెందిన ఒక ఆసక్తికర విషయం బయటపడింది. 20 ఏళ్ల క్రితం పిల్లోడిగా ఉన్న రియాన్ పరాగ్.. ధోనితో ఫోటో దిగాడు. అప్పుడు పరాగ్ వయసు రెండేళ్లు. అదే పరాగ్.. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. వీరిరువురు కలిసి మరో ఫోటో దిగారు. అయితే ఈ ఫోటో వెనకాల ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది.
 
ఇరవై ఏళ్ల క్రితం బీహార్ (అప్పటికీ దాన్నుంచి జార్ఖండ్ విడిపోలేదు) అసోంల మధ్య రంజీ మ్యాచ్ జరుగుతుంది. అసోం సెకండ్ ఇన్నింగ్స్. బ్యాట్స్‌మెన్ అసోం ఓపెనర్ పరాగ్ దాస్. బీహార్ తరఫున మన జార్ఖండ్ డైనమైట్ ధోని వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. బౌలర్ వేసిన బంతికి దాస్ ముందుకెళ్లి ఆడబోయాడు. అది కాస్తా మిస్సయింది. ఇంకేం.. అసలే వికెట్ల వెనుక బంతి కోసం ఆకలిగొన్న పులిలా వేచిచూసే మన డైనమైట్.. దాస్‌ను స్టంపౌట్ చేశాడు. ఆ పరాగ్ దాస్ కొడుకే ప్రస్తుత రియాన్ పరాగ్.
 
కాల చక్రం గిర్రున తిరిగింది. ఐపీఎల్ 2020 సీజన్. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్. బౌలర్ సామ్ కరన్. వికెట్ల వెనుక ధోని. బ్యాటింగ్ రియాన్ పరాగ్. కానీ ఈ సారి పరాగ్.. ధోనికి స్టంపింగ్ చేసే అవకాశమివ్వలేదు. అదండీ వీరి వెనకున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒకప్పుడు తన తండ్రిని ఔట్ చేసిన వ్యక్తే.. ఇరవై ఏళ్ల తర్వాత కూడా కీపింగ్ చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిస్ గేల్ రాకతో "పంజాబ్ జిగేల్" ... వరుస ఓటములకు బ్రేక్!