Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం కడిగిన నీటిలో దాల్చిన చెక్క పొడిని వేసి తాగితే?

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (10:37 IST)
దాల్చిన చెక్కను మసాలాలలో, బిర్యానీలలో ఎక్కువగా వాడుతుంటాం. ఇది వంటకానికి మంచి రుచి, సువాసన ఇస్తుంది. దీనిని వంటకాల్లోనే కాక ఆరోగ్య రక్షణకు కూడా ఉపయోగించవచ్చు. ఇది పలు రకాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.


సాధారణంగా మహిళలు రుతుసమయంలో వచ్చే నొప్పులతో బాధపడుతుంటారు. ఆ సమస్య నుండి బయటపడాలంటే బియ్యం కడిగిన నీటిలో మూడు స్పూన్ల దాల్చిన చెక్క పొడి వేసి త్రాగితే ఫలితం ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొంత మందికి గుండె పట్టేసినట్లు ఉంటుంది. 
 
అలాంటప్పుడు దాల్చిన చెక్కను మెత్తగా పొడి చేసి అందులో యాలకుల పొడిని కూడా కలిపి నీటిలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని కషాయం రూపంలో త్రాగితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది. తలనొప్పి తగ్గాలంటే దాల్చిన చెక్క చూర్ణాన్ని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి నుదుటిపై రాసుకుంటే సరిపోతుంది.
 
చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలుపుకుని రోజూ మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది. తేనెను వేడి చేసి అందులో రెండు స్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలిపి చర్మానికి రాసుకున్నా లేదా సేవించినా దురదలు, చెమట పొక్కులు, ఎగ్జిమా నుండి ఉపశమనం పొందవచ్చు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు పాలలో 2 స్పూన్ల దాల్చిన చెక్క పొడి, కొద్దిగా చక్కెర వేసి తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

తర్వాతి కథనం
Show comments