Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో...

పుదీనా ఆకులను ఎక్కువగా వంటకాల్లో వాడుతుంటాం. దీని వలన వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. పుదీనా ఆహార పదార్థంగానే కాకుండా పలు అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే పుదీనా ఆకు

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (15:58 IST)
పుదీనా ఆకులను ఎక్కువగా వంటకాల్లో వాడుతుంటాం. దీని వలన వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. పుదీనా ఆహార పదార్థంగానే కాకుండా పలు అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే పుదీనా ఆకులతో తయారు చేసే టీని ప్రతిరోజూ తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
మరి ఈ పుదీనా టీ ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 కప్పుల నీటిలో ఒక బౌల్‌లో తీసుకుని ఆ తర్వాత అరకప్పు పుదీనా ఆకులను వేసుకుని బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత ఈ మిశ్రమంలో తగినన్ని పాలు, ఒక యాలక్కాయ వేసుకుని మరికాసేపు మరిగించుకోవాలి. టీ చల్లారిన తరువాత వడకట్టుకోవాలి. మరి ఈ టీలో గల లాభాలు తెలుసుకుందాం. 
 
పుదీనాలో ఉండే విటమిన్ ఎ, సిలు శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి. ఈ పుదీనా టీని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే శరీర పనితీరు పెరుగుపడుతుంది. తద్వారా శరీరానికి కావలసిన రాగి, పీచు, క్యాల్షియం, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు కూడా అందుతాయి. 
 
గర్భిణీలకు అవసమయ్యే ఫోలిక్ యాసిడ్, ఒమెగా-3, ఫ్యాటీ యాసిడ్స్ పుదీనా టీలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీలకే కాకుండా శిశువు ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. శరీరంలో కణతులు పెరగకుంటా ఉంటాయి. పలు రకాల క్యాన్సర్స్ రాకుండా కాపాడుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

31 నుంచి పల్నాడులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనను ఆమోదించిన సీడబ్ల్యూసీ

భారతమాత ముద్దుబిడ్డల్లో మన్మోహన్ సింగ్ ఒకరు : రాష్ట్రపతి ముర్ము

Manmohan Singh Death: నా మార్గదర్శిని కోల్పోయాను .. రాహుల్ గాంధీ

డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి : ఏడు రోజుల పాటు సంతాప దినాలు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఆడవాళ్లకు ఎలాంటి సమస్యలు లేవు లెండి.. పూనమ్ కౌర్ వ్యంగ్యాస్త్రాలు

కొత్త ఏడాది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో షురూ కానుందా !

సీఎం ఆఫర్ వచ్చింది.. సున్నితంగా తిరస్కరించా : సోను సూద్

Game changer DHOP, చెర్రీ-కియారా ధోప్ సాంగ్ సోషల్ మీడియాలో షేక్ (Video)

"ఎల్లమ్మ"లో కనిపించనున్న సాయిపల్లవి..?

తర్వాతి కథనం
Show comments