కుంభరాశికి చెందినవారు ఏ సమస్యనైనా చిరు నవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు. ఇందువల్ల వారి వైవాహిక జీవతం సాఫీగా సాగుతుంది.లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవటం వంటివాటిని వీరు ఇష్టపడరు.ఇక స్త్రీల విషయానికి వస్తే తమ వైవాహిక జీవితం పదికాలాలపాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలు ఆచరిస్తారు. భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు. ఫలితంగా వీరు కుటుంబంలో దాదాపు చిన్నచిన్న స్పర్థలకు కూడా తావే ఉండదు. ఇక వివాహం కావలసిన వారి విషయానికి వస్తే ఆధునిక భావాలను అంగీకరించని కారణంగా కాస్తంత ఆలస్యమైనా వివాహానంతరం సుఖశాంతులతో జీవనం కొనసాగిస్తారు.