కుంభరాశికి చెందిన వారు అత్యంత కాముకులుగా ఉంటారు. వీరిపట్ల ఇతురులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది.అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పవచ్చు. కుంభరాశివారు ప్రేమ ఊహల్లో తేలియాడతారు. అయితే వాటిని నిజం చేసుకోవటానికి చేసిన ప్రయత్నంలో విజయం సాధిస్తారు. జాతకరీత్యా వీరు అత్యంత ఆకర్షణీయతను కలిగి ఉంటారు. ఒకసారి తమ హృదయంలో తమ ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది. అయితే అలాగని అది హద్దులు దాటి విపరీతానికి దారితీయదు. తాను ప్రేమించిన వారిపట్లు అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు. వీరితో ప్రేమను పంచుకునే వారు చాలా సంతోషంగా ఉంటారు. తమ ప్రేమికులను తృప్తిపరచటానికి ఎంతటి త్యాగానికైనా వెనకడుగు వేయరు.