కుంభరాశికి చెందిన వారి జాతకంపై శనిగ్రహం ప్రభావం ఉంటుంది. కనుక వీరికి కలిసి వచ్చేరోజు శనివారంగా ఉంటుంది. శనిదేవుడు ఈ రోజును కుంభరాశికి చెందిన వారి పట్ల ప్రసన్నుడుగా ఉంటాడు. ఇంకా వీరికి మంగళవారం శుభప్రదంగానే ఉంటుంది. అదేవిధంగా ఆదివారం మధ్యమంగానూ ఉంటుంది. అయితే బుధవారం, శుక్రవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి.