కుంభ రాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారుగా ఉంటారు. అంతేకాదు కుటుంబపరంగా వారికి ఏ లోటూ ఉండదు.వీరికున్నటువంటి త్యాగగుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరి జాతక ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకూ విశ్రమించరు. దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. వీరికి మంచి యోగ్యవంతులైన సంతానం కలుగుతారు.ఇక సుఖ సంతోషాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి.