కుంభం-గుణగణాలు
సన్నగా పీలగా ఉంటారు. అయినా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తుతో తెల్లని రంగుతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన ఈ రాశివారు మిగిలిన రాశులు వారితో అత్యంత స్నేహ పాత్రంగా మెలగుతారు. ఇతరులకు సాయపడే గుణం వలన వీరంటే అందరూ ఇష్టపడతారు.మొత్తం మీద చూసినప్పుడు ఈ రాశి వారు ఇతురులను అవహేళనచేసి మాట్లాడటం అంటే వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారంటే ఎక్కువగా ఇష్టపడతారు.తాము చేసే పనులను చేతల్లో కాక మాటల్లో చూపిస్తారు. వీరు ముక్కుసూటి తనం శత్రువులను కూడా తెచ్చి పెడుతుంది. అయినప్పటికీ తమకంటూ ఉన్న నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. అలాగే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితోపాటు మొండి పట్టుదలకూడా ఉంటుంది. ఫలితంగా అనవసర సమస్యలలో చిక్కుకుంటారు.
Show comments