Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-08-2021 నుంచి 28-08-2021 వరకు మీ వార రాశిఫలితాలు

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (01:41 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. మనస్సు కుదుటపడుతుంది. పనుల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త విషయాలు బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అవివాహితులకు శుభయోగం. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి, విద్యార్థులకు ఒత్తిడి ,  ఆందోళన అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. కంప్యూటర్ , సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయిన వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. నగదు, పత్రాలు జాగ్రత్త. గృహమార్పు కలిసివస్తుంది. మీ జోక్యం అనివార్యం. మీ సలహా సన్నిహితులకు ఉపకరిస్తుంది. సంతానం పై చదువులపై దృష్టిపెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాలు సామాన్యం. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత వుంది. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆదాయం సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దమొత్తం ధనసాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ కించపరచవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఆహ్వానం అందుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారలు అంతంత మాత్రంగా సాగుతాయి. భాగస్వామిక వ్యాపారాలకు తరుణం కాదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. లౌక్యంగా వ్యవహరించడం మంచిది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. బంధుమిత్రులతో స్పర్ధలు తలెత్తుతాయి. మీ మాటతీరు అదుపులో వుంచుకోండి. బుధ, గురువారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహానిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.
 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఖర్చులు అదుపులో వుండవు. అవసరాలకు ధనం అందుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. మంగళ, శనివారాల్లో పనులు సాగవు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. గృహమార్పు నిదానంగా ఫలిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు కష్టకాలం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికం. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం. అధికారులకు హోదామార్పు, ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. మంచి చేయబోతే  చెడు ఎదురవుతుంది. అప్రమత్తంగా వుండాలి.  శకునాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో వ్యవహరించండి. అవకాసాలు చేజారిపోయినా ఒకందుకు మంచిదే. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి.  సోమ, మంగళవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. ఖర్చులు అధికం. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి  వ్యయం చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికం. ప్రయాణం విరమించుకుంటారు.
 
తుల:  చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. బంధువులతో ఉల్లాసంగా గడుపుతాపు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్త పనులు చేపడతారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బుధావారం నాడు వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు.  దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం. కార్మికులకు ఆశాజనకం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 3 పాదములు
సమర్థతను చాటుకుంటాు. నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆప్తులకు సాయం అందిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఉభయులకు ఆమోదయోగ్యం అవుతుంది. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. పెట్టుబడులకు అనుకూలం. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ద వహించండి. గురు, శుక్రవారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కష్టకాలం.
 
ధనస్సు:  మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆదాయం సంతృప్తికరం. కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. రోజువారీ ఖర్చులే వుంటాయి.  పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం  ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన అనివార్యం. తొందరపడి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. ఆది, శనివారాల్లో దంపతుల మధ్య అకారణ కలహం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం వైఖరి విసుగు కలిగిస్తుంది. అనునయంగా కలిసివస్తుంది. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం ఆశాజనకం. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి  వస్తాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు.  ఇతరులను మీ విషయలకు దూరంగా వుంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. పదవులు అందుకుంటారు. ఉపాధి అవకాసాలు కలిసివస్తాయి. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులతో హడావుడిగా వుంటారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది.  పెద్దల సలహా పాటిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం తప్పిపోతుంది. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం వైఖరి చికాకు పరుస్తుంది.  ఓర్పుతో మెలగండి. గృహ ప్రశాంతతను భంగపరుచుకోవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి ఉపాది పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను  అధిగమిస్తారు. కార్మికులకు పనులు  లభిస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అనుకూలతలున్నాయి. శుభకార్యం తలపెడతారు. బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. పసులు సకాలంలో పూర్తి చేస్తారు. సోమ, మంగళ వారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు ప్రయత్నిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమతంగా వుండాలి. ప్రలోభాలకు పోవద్దు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కంప్యూటర్ రంగాల వారికి ధనయోగం.  వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాట తప్పిన జూనియర్ ఎన్టీఆర్.. బోరున విలపిస్తున్న ఓ తల్లి!!

Mohan Babu: మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

Seethakka: అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డా.. జై భీమ్‌కు అలాంటి గౌరవం లభించలేదు..

గాంధీ భవన్‌కు వెళ్లిన అల్లు అర్జున్ మామ.. పట్టించుకోని దీపా దాస్ మున్షి (video)

Sandhya Theatre stampede: రేవంత్ రెడ్డి కామెంట్లతో ఏకీభవిస్తా, బీజేపీ ఎమ్మెల్యే సంచలనం

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments