రేపే రాఖీ పౌర్ణమి, సోదరి ఏం చేయాలో తెలుసా?

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (23:47 IST)
రేపే రాఖీ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటుస్నానం చేయాలి. ఆ తర్వాత రక్షారేకును పూజించాలి. అనంతరం సోదరి తన అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి. శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్న సమయంలో వారికి రాఖీ కట్టాలి. ఆ తర్వాత నోరు తీపి చేయడం సంప్రదాయం.
 
మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు, మధ్యాహ్నం వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటాయి. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని, ఆ సమయంలోనే రాఖీని కట్టించుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక పెళ్లి అయిన ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలను కట్టడం సంప్రదాయం. 
 
పూర్వకాలంలో భర్తకి భార్య రక్షణ కోసం రాఖీని కట్టేది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కడుతుంది. పురాణ కాలంలో రాజులు యుద్ధాలకువెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షను కట్టుకొని ఆ తర్వాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు. రాఖీ పౌర్ణమీ రోజు కట్టే రక్షలో ఆసామాన్యమైన విష్ణుశక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని ఇంధన పొదుపు పిలుపు: విధాన్ భవన్‌కి మోటాల్ సైకిల్ పైన వచ్చిన మహారాష్ట్ర సీఎం, వీడియో

కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తో సచివాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు

శస్త్రచికిత్స అనంతరం అమరావతికి తిరిగి వచ్చిన పవన్ కల్యాణ్

నల్లకోటు ధరించి న్యాయవాదిగా మారిన మాజీ ముఖ్యమంత్రి ఎవరు?

ఉత్కంఠకు తెర : కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్

అన్నీ చూడండి

లేటెస్ట్

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

12-05-2026.. మంగళవారం ఫలితాలు - సర్వత్రా అనుకూలమే

తర్వాతి కథనం
Show comments