Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

25-07-2021 నుంచి 31-07-2021 వరకు మీ వార రాశి ఫలితాలు

25-07-2021 నుంచి 31-07-2021 వరకు మీ వార రాశి ఫలితాలు
, శనివారం, 24 జులై 2021 (18:28 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ప్రశంసలు అందుకుంటారు. ధనలాభం వుంది. ఉత్సాహంగా గడుపుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. బంధువులతో సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. గుట్టుగా వ్యవహరించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పిల్లల ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. అధికారులకు స్వాగతం పలుకుతారు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో వుండవు. రాబడిపై దృష్టి పెడతారు. గృహమార్పు కలిసివస్తుంది. ఆది, సోమవారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయ. పాతపరిచయస్తులు తారసపడుతారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు సామాన్యం. భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. రాబోయే ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. బంధుమిత్రులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. మంగళవారం నాడు అప్రమత్తంగా వుండాలి. దంపతుల మధ్య సఖ్యతలోపం, అకారణ కలహం. పనివారల వైఖరి అసహనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకోకండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. అధికారులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలు అనుకూలం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఈ వారం వ్యవహారాలతో తీరిక వుండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. సంప్రదింపులు ముందుకు సాగవు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ఖర్చులు విపరీతం. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. ఆప్తులను కలుసుకుంటారు. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
మీ ఓర్పు నేర్పులకు పరీక్షా సమయం. ఆచితూచి వ్యవహరించాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. రుణ సమస్యలతో మనస్థిమితం ఉండదు. ఇంటి పరిస్థితులు చికాకు పరుస్తాయి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. ప్రయాణం విరమించుకుంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
శుభకార్యానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తారు. ఆశించిన సంబంధం కలిసిరాదు. ఓర్పుతో వ్యవహరించండి. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. గురు, శనివారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. గృహ మరమ్మత్తులు చేపడతారు. సంతానం ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో జాగ్రత్త.  ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. 
 
తుల: చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
వ్యవహార దక్షతతో రాణిస్తారు. గౌరవమర్యాదలు పెంపొందుతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఖర్చులు అదుపులో వుండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మంగళ, గురువారాల్లో పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రియతములతో సంప్రదింపులు జరుపుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. నిరుద్యోగులకు ఉపాధి ఫథకాలు కలిసివస్తాయి. విద్యా సంస్థలకు ఆశాజనకం. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 3 పాదములు 
ఆర్థిక లావాదేవీలతో తీరిక వుండదు. హామీలు నిలబెట్టుకుంటారు. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. ధనలాభం వుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆది, బుధవారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. దంపతులకు కొత్త ఆలోచనులు స్ఫురిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కొత్త అధికారులకు స్వాగతం పలుకుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం 
శ్రమాధిక్యత మినహా ఫలితం వుండదు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. సన్నిహితుల హితవు మీపై సత్ఫ్రభావం చూపుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సోమ, మంగళవారాల్లో అనుకోని సంఘటనలెదురవుతాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు, పంతాలకు పోవద్దు. పెద్దల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. కిట్టని వారు తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. షాపు పనివారలతో జాగ్రత్త. వైద్య రంగాల వారికి ఆశాజనకం. విదేశీయాన ప్రయత్నాలు విరమించుకుంటారు. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. కొన్ని విషయాలు తెలియనట్టే మెలగండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. బుధ, గురువారాల్లో వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. వీలైనంత వరకు ఆత్మీయులతో కాలేక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారులకు అదనపు బాధ్యతలు. విద్యా సంస్థల ఆదాయమ అంతంత మాత్రంగా వుంటుంది. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహిస్తారు. మీ వైఖరిలో మార్పు వస్తుంది. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడులు ప్రయోగాలకు తరుణం కాదు. డబ్బు మితంగా వ్యయం చేయండి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించివద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. శుక్ర, శనివారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి. కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగస్తులకు ఓర్పు ఏకాగ్రత ప్రధానం.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
అన్ని రంగాల వారికి యోగదాయకమే. శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. వేడుకను నిరాడంబరంగా జరుపుతారు. రావలసిన ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే వుంటాయి. కొన్ని పనులు అనుకోకుండా పూర్తవుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ధార్మిక సంస్థలకు విరాళాలు అందజేస్తారు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ధనలాభం. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. జూదాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24-07-2021 గురు పూర్ణిమ, ఏం చేయాలి?