Webdunia - Bharat's app for daily news and videos

Install App

05-03-2023 నుంచి 11-03-2023 వరకు మీ వార రాశి ఫలితాలు

Webdunia
శనివారం, 4 మార్చి 2023 (22:33 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అపజయాలకు కుంగిపోవద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. ఖర్చులు విపరీతం. చేబదుళ్ళు స్వీకరిస్తారు. సోమ, మంగళవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణం తలపెడతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా తీసుకోండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. చిట్స్, ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. జాతక పొంతన ప్రధానం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఖర్చులు సామాన్యం. పనులు వేగవంతమవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహ మరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. బుధ, గురువారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. ప్రయాణం తలపెడతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. శనివారం నాడు నగదు చెల్లింపులో మెలకువ వహించండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. సాంకేతిక రంగాల వారికి అవకాశాలు కలిసివస్తాయి. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆచితూచి వ్యవహరించాలి. మీ వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరిస్తారు. మిత సంభాషణ శ్రేయస్కరం. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసహాయం అర్ధించటానికి మనస్కరించదు. సన్నిహితుల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశికతను అర్థం చేసుకుంటారు. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. నోటీసులు అందుకుంటారు. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు స్థానచలనం ఉపాధి పథకాలు కలిసివస్తాయి. విద్యార్థులకు సమయపాలన, ఏకాగ్రత ప్రధానం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉపాధ్యాయులకు ఒత్తిడి. పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. ఆదాయం బాగుంటుంది. వేడుకును ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. బంధువుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆది, సోమవారాల్లో చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు మెరుగైన సలహాలిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. గృహనిర్మాణాలు, సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉపాధి పథకాలు చేపడతారు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారానుకూలత ఉంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన ధనం త్వరలో అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. అవివాహితులకు శుభవార్తాశ్రవణం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కార్మికులకు పనులు లభిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆది, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో మెలకువ వహించండి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పనిభారం. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. శుక్రవారం నాడు ఒక పట్టాన పూర్తి కావు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆరోగ్యం బాగుంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఓర్పు ప్రధానం. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను పూర్తి చేయగల్గుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. త్వరలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆది, బుధ వారాల్లో కొత్తవ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఆప్తులతో సంభాషణ ఉత్సాహాన్పిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
బంధుమిత్రుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. మిమ్ములను తప్పుపట్టిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్‌ వంటి అంశాల్లో అలక్ష్యం తగదు. బాధ్యతలు అప్పగించవద్దు. శుక్ర, శనివారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అంతర్యం గ్రహించండి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. అధికారులకు కొత్త బాధ్యతలు, స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారాలకు పురోభివృద్ధి, విద్యార్థులు పరీక్షలు బాగా రాయగలుగుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచార బాధితులకు ఎక్కడైనా వైద్యం చేయాలి : ఢిల్లీ హైకోర్టు

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

వైకాపా విధ్వంసానికి పరిష్కారం లభించడం లేదు : సీఎం చంద్రబాబు

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగిందంటే? (video)

Shawls Turned Dresses: దుస్తులుగా మారిన శాలువాలు.. ఎమ్మెల్యే చింతమనేని అదుర్స్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments