Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

26-02-2023 నుంచి 04-03-2023 వరకు మీ వార రాశిఫలాలు (వీడియో)

Advertiesment
Weekly Astrology
, శనివారం, 25 ఫిబ్రవరి 2023 (21:28 IST)
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవవుతాయి. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. నిరుత్సాహం వీడి యత్నాలు కొనసాగించండి. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సోమ, మంగళవారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అవివాహితులకు శుభవార్తాశ్రవణం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. కీలక సమావేశాల, సభల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. బుధవారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఈ చికాకులు తాత్కాలికమే. ఆశావహదృక్పథంతో మెలగండి. ఓర్పు, పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికుల ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలకు అనుకూలం. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్తులకు పురోభివృద్ధి. భూ సంబంధిత వివాదాలు సద్దుమణుగుతాయి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఈ వారం అన్ని రంగాల వారికీ అనుకూలమే. సంకల్పం సిద్ధిస్తుంది. వ్యవహార దక్షతతో రాణిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వ్యవహారాలను సమర్ధంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విరివిగా వ్యయం చేస్తారు. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. నిరుద్యోగులకు శుభయోగం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొంతమంది వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. జాతక పొంతన ప్రధానం. పెద్దల సలహా పాటించండి. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్ అలక్ష్యం తగదు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. అకౌంట్స్, రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకకు హాజరుకాలేరు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. శుక్ర, శనివారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. ఈ చికాకులు తాత్కాలికమే. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. ఆత్యీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. సన్నిహితుల ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. వృత్తుల వారికి పురోభివృద్ధి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆది, సోమవారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. సంతానం చదువులపై దృష్టి పెడతారు. గృహమార్పు కలిసివస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వాహనదారులకు ఏకాగ్రత ప్రధానం.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
మీ భావాలకు తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వాగ్ధాటితో రాణిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం అందుకుంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. మంగళవారం నాడు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో నిర్లక్ష్యం తగదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకకు ముహూర్తం నిశ్చయమవుతుంది. వివాదాలు పరిష్కారమవుతాయి.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. బుధ, గురువారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. నిరుద్యోగులకు శుభయోగం. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. న్యాయ, సేవ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్ సేల్ డీలర్లకు ఆదాయాభివృద్ధి. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సమర్ధతను చాటుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. కొంత మొత్తం పొదుపు చేయగల్గుతారు. పనులు వేగవంతమవుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆదివారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఆహ్వానం అందుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు పనిభారం. నిర్యాణాలు, సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఆర్ధికలావాదేవీలు కొలిక్కివస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మంగళ, బుధవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆధ్యాత్మికతపై అసక్తి పెంపొందుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. బంధువుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రతి చిన్న విషయానికీ విసుగు చెందుతారు. గురు, శుక్రవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పిల్లల చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం సంతృప్తికరం. సన్నిహితుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. అకౌంట్స్ రంగాల ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక పట్టాన పనులు సాగవు. శనివారం నాడు ఊహించని ఖర్చులుంటాయి. ధనం పొదుపుగా వ్యయం చేయండి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివుడి వరంతో ఏర్పడిన వాస్తు!