Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-02-2023 నుంచి 11-02-2023 తేదీ వరకు వార ఫలితాలు

Weekly astrology
, శనివారం, 4 ఫిబ్రవరి 2023 (21:03 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ఆచితూచి అడుగేయాలి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది. మీ అభిప్రాయాలను ఆప్తుల ద్వారా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. పిల్లల చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం సంతృప్తికరం. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
కుజ గ్రహం మినహా మిగిలిన గ్రహాలు అనుకూలిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రాబడిపై దృష్టి పెడతారు. పనులు వేగవంతమవుతాయి. ఆది, సోమవారాల్లో ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సన్నిహితుల సలహా తీసుకోండి. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. అవకాశాలను తక్షణం సద్వినియోగం చేసుకోండి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మంగళ, బుధవారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త వ్యక్తులను నమ్మవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
అనుకూలతలు అంతంత మాత్రమే. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఆది, గురువారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కీలక పత్రాలు అందుకుంటారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. నిర్మాణాలకు ఆమోదం లభిస్తుంది. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి సామాన్యం. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
సంకల్పసిద్ధికి ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. అవకాశాలు చేజారిపోతాయి. మీ అశక్తతను కొంతమంది అనుకూలంగా మార్చుకుంటారు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమినిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్ట సమయం. అధికారులకు హోదా మార్పు, పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆదివారం నాడు పనులు సాగవు. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. మీ శ్రీమతి ఆంతర్యం గ్రహించండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ప్రకటనలు, దళారులను ఆశించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సన్నిహితుల సలహా పాటించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. సోమ, మంగళవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పురస్కారాలు అందుకుంటారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఇంటి అలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువవులు కొనుగోలు చేస్తారు. బుధవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఈ వారం ఆశాజనకం. చాకచక్యంగా వ్యవహరిస్తారు. కార్యం సిద్ధిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. సంతానం భవిస్యత్తుపై దృష్టి పెడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పదవుల నుంచి తప్పుకోవలసి వస్తుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. ఇంటి సమస్యలపై దృష్టి సారించండి. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు యూనియన్ గుర్తింపు లభిస్తుంది. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మునుముందు. సత్ఫలితాలిస్తాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆచితూచి అడుగేయాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. ఆది, గురువారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. చీటికిమాటికి చిరాకుపడతారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. శనివారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు కష్టకాలం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

04-02-2023- శనివారం- తెలుగు పంచాంగం