Webdunia - Bharat's app for daily news and videos

Install App

08-05-2022 నుంచి 14-05-2022 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

Webdunia
శనివారం, 7 మే 2022 (16:33 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఏ పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. రోజులు భారంగా గడుస్తాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. సోమ, మంగళ వారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. సన్నిహితులను కలుసుకుంటారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా భావించవద్దు. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. బాధ్యతలు అప్పగించవద్దు. బిల్డర్లకు కష్టకాలం. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 

 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. బుధవారం నాడు నగదు ద్రా చేసేటపుడు జాగ్రత్త. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. గృహమార్పు అనివార్యం. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఏమంత సంతృప్తినీయవు. హోల్‌సేల్ వ్యాపారులకు సామాన్యం. ప్రేమికుల వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.

 
మిథునం: మృగశిర 3, 4 పాదములు, ఆర్థ, పునర్వసు 1, 2, 3 పాదములు 
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. శుక్ర, శని వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. బిల్డర్లు, కార్మికులకు నిరుత్సాహకరం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 

కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
అన్ని రంగాల వారికి యోగదాయకమే. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆది, సోమ వారాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. యోగ, ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. వ్యాపార లావాదేవీలు కొలిక్కివస్తాయి. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 

 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అకాల భోజనం, అధిక శ్రమ. పరిస్థితులు అనుకూలించవు. నిస్తేజానికి లోనవుతారు. యత్నాలు కొనసాగించండి. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మంగళవారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ భాగస్వామి సలహా పాటించండి. ఆహ్వానం అందుకుంటారు. వేడుకల్లో కొత్త పరిచయాలేర్పడతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు.

 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బుధ, గురు వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. గృహమార్పు అనివార్యం. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. గుర్తు తెలియని వ్యక్తులు మోసగిస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉపాధి పథకాలు చేపడతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.

 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఒక వ్యవహారం మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. ఆది, శుక్ర వారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. తొందరపడి మాట ఇవ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. నూతన వ్యాపారాలు ఏమంత సంతృప్తినీయవు. వృత్తి ఉపాధి పథకాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. 

 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదములు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. మీ పెద్దరికానికి ఉన్నత గౌరవం లభిస్తుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యం తలపెడతారు. పెట్టుబడులకు పనులు ఊపందుకుంటాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త, గుట్టుగా వ్యవహరించండి. శనివారం నాడు కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. సన్నిహితుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. 

 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. దంపతుల మధ్య అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. కొత్త అధికారులకు స్వాగతం పలుకుతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు సమస్యలెదురవుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. 

 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఈ వారం వ్యవహార జయం, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. అనుకున్నది సాధిస్తారు. మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిచయాలు. వ్యాపకాలు విస్తరిస్తాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆదాయం రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 

 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కలుపుగోలుగా వ్యవహరిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. సోమ, మంగళ వారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గృహ మరమ్మతులు చేపడతారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయంలో మెలకువ వహించండి. ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు. ప్రియతముల రాక ఉత్సాహాన్నిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.

 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. గురు, శుక్రవారాల్లో గుట్టుగా వ్యవహరించండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల రాక ఉత్తేజాన్నిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. చేతివృత్తులు, కార్మికులకు పనులు లభిస్తాయి. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

తర్వాతి కథనం
Show comments