Webdunia - Bharat's app for daily news and videos

Install App

07-05-22 శనివారం రాశిఫలాలు - రమాసమేత సత్యనారాయణస్వామిని...

Webdunia
శనివారం, 7 మే 2022 (04:00 IST)
మేషం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కొత్త వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ, వాణిజ్య ఒప్పందాలకు ఇది అనుకూలమైన సమయం కాదని గమనించండి. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చక పోవచ్చు.
 
వృషభం :- చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరువ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. విద్యార్థులకు విద్యావిషయాల్లో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఊహించని ఖర్చులు ఎదురైనా ఆర్థిక ఇబ్బందులు అంతగా ఉండవు.
 
మిథునం :- వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం శ్రేయస్కరం. ప్రయాణాలు అనుకూలం. కుటుంబ అవసరాలు పెరగటంతో అదనపు సంపాదన కోసం యత్నాలుచేస్తారు. ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖికపరీక్షల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
కర్కాటకం :- గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు పురోభివృద్ధి, ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. సన్నిహితుల నుండి అన్ని విధాలా సహకారం, ప్రోత్సాహం లభిస్తాయి. సాహస ప్రయత్నాలు విరమించడం మంచిది. రచయితలకు, కళాకారులకు సదావకాశాలు లభిస్తాయి.
 
సింహం :- ఏదైనా అమ్మకానికై చేయు యత్నం వాయిదా పడటం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కొంతమంది మీ నుంచి సమాచారం సేకరించటానికి యత్నిస్తారు. వాహనచోదకులకు ఏకాగ్రత అవసరం.
 
కన్య :- బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. పోస్టల్, కొరియర్ రంగాల వారికి విశ్రాంతి లభిస్తుంది. రావలసిన ఆదాయం అందటంతో ఆర్థికంగా ఒకడుగు ముందుకేస్తారు. ప్రైవేటు సంస్థలలో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
తుల :- వ్యవసాయ, తోటల రంగంలో వారికి వాతావరణ మార్పు వల్ల అందోళనకు గురవుతారు. చేనేత, ఖాదీ వస్త్ర పరిశ్రమల వారికి, పనివారలకు ఆశాజనకం. భాగస్వామ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. స్త్రీల సృజనాత్మక శక్తికి, తెలివి తేటలకు గుర్తింపు లభిస్తుంది.
 
వృశ్చికం :- ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. ఆపత్సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. సన్నిహితుల నుంచి అందిన ఒక సమాచారం మీలో కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక అనుకూలించినా ఆశించిన ప్రయోజనకరంగా ఉండదు.
 
ధనస్సు :- కళాకారులకు, రచయితలకు అభిమాన బృందాలు అధికం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూరప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించడం వల్ల భంగపాటుకు గురవుతారు. స్త్రీల సృజనాత్మక శక్తికి, తెలివితేటలకు గుర్తింపులభిస్తుంది.
 
మకరం :- కుటుంబీకుల మధ్య ముఖ్యమైన వ్యవహారాలలో ఏకీభావం కుదరదు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి. ఊహించనిఖర్చులు ఎదురైనా ఆర్థిక ఇబ్బందులు అంతగా ఉండవు. ఏ.సి., ఇన్వెస్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
కుంభం :- రాజకీయ, కళా రంగాల్లో వారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఆత్మీయులతో కలిసి విందులు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనిభారం అధికం. ప్రయత్న లోపం వల్ల కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు.
 
మీనం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సత్ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఉన్నతాధికారుల పై దాడులు జరిగే ఆస్కారం ఉంది. కంప్యూటర్ రంగాల వారు పురోభివృద్ధి పొందుతారు. రాబడికి మించిన ఖర్చులు ఎదురౌతాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

Donald Trump: నాకు టిమ్ కుక్‌తో చిన్న సమస్య ఉంది.. డొనాల్డ్ ట్రంప్

వైకాపాకు షాక్... మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర రాజీనామా

Baba Singh: యూపీ బీజేపీ నేత బాబా సింగ్ రఘువంశీ పబ్లిక్ రాసలీలలు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

Tirumala: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తత-తిరుమల కొండపై భద్రతను పెంచిన టీటీడీ

శనిత్రయోదశి: శనివారం, త్రయోదశి తిథి.. విశేష పర్వదినం

Shani Trayodashi 2025: శని త్రయోదశి నాడు ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments