Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-05-22 గురువారం రాశిఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం...

Advertiesment
Astrology
, గురువారం, 5 మే 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి. మీ లక్ష్యాన్ని చేరుకోవటానికి అధిక కృషి చేస్తారు. కార్యసాధనలో శ్రమాధిక్యత, వ్యయ ప్రయాసలు తప్పవు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తుల సమర్థతకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
వృషభం :- ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులు ఉంటాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దైవ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.
 
మిథునం :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
కర్కాటకం :- రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. నూనె,మిర్చి, పసుపు, ఉల్లి, ఎండుమిర్చి, ధాన్యం వ్యాపారస్తులకు అభివృద్ధి. ఊహించని ఖర్చులు, దుబారా వ్యయం అధికంగా ఉంటాయి. పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. బంధు మిత్రుల కారణంగా మీ కార్యక్రమాల వాయిదా పడతాయి.
 
సింహం :- కోళ్ళ, మత్స్య రంగాల్లో వారికి చికాకులు తప్పవు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్స్‌కు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పని భారం బాగా పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కన్య :- భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. రాజకీయ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. వాహన చోదకులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
 
తుల :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. స్త్రీలకు ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. వాహనచోదకులకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సత్ఫలితాలు లభిస్తాయి.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. మిత్రుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. పెద్దలకు ఆహార వ్యవహారాల్లో మెళుకువ వహించండి.
 
ధనస్సు :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. విద్యార్థులు బజారు తిను బండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
మకరం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళుకువ అవసరం. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. పని ఒత్తిడి, శ్రమాధిక్యత అధికమవుతాయి. ఎ.సి. కూలర్లు, ఇన్వెర్టర్ రంగాలలో వారికి శుభదాయకంగా ఉంటుంది.
 
కుంభం :- ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. అధిక ఉష్ణం వల్ల మీ సంతానం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధువర్గాల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో గణనీయమైన అభివృద్ధిని పొందుతారు. అనుకోకుండా ఒక చిన్నారితో విడదీయరాని బంధం ఏర్పడుతుంది.
 
మీనం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు. అందివచ్చిన అవకాశం చేజారినా ఒకందుకు మంచిదేనని అనిపిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుద్రాక్ష మాల ధరించిన వారికి...