Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

01-05-22 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్య హృదయం చదివిన లేక విన్నా...

Advertiesment
astro8
, ఆదివారం, 1 మే 2022 (04:00 IST)
మేషం :- ఆర్థికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. మొక్కుబడులు చెల్లిస్తారు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. మీ కుటుంబీకుల ఆరోగ్యంలో మెలకువ వహించండి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
 
వృషభం :- భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. దేవాలయ విద్యా సంస్థలకు దాన ధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. కుటుంబీకులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది.
 
మిథునం :- ఆర్ధికస్థితిలో ఏమాత్రం పురోభివృద్ధి ఉండదు. దంపతుల మధ్య నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన పెరుగుతుంది.
 
కర్కాటకం :- వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సాహస ప్రయత్నాలు విరమించండి. దైవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.
 
సింహం :- ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. మీ రాక బంధువులకు ఆనందాన్ని ఇస్తుంది. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం మంచిది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు.
 
కన్య :- పీచు, ఫోం, లెదర్ వ్యాపారులకు కలసిరాగలదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. బంధు మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. భార్యా భర్తల మధ్య అవగాహన అవసరం. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
 
తుల :- ఉమ్మడి వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం తప్పకపోవచ్చు. స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. సంతానాభివృద్ధి బాగుంటుంది.
 
వృశ్చికం :- ట్రాన్సుపోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. సన్నిహితులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. చిన్నతరహా పరిశ్రమల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులకు ఏకాగ్రత అవసరం.
 
ధనస్సు :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది. ప్రేమికులకు తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామిక చర్చలు, కీలకమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. రాబడికి మించిన ఖర్చులుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
మకరం :- మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. టెక్నికల్, లా, మెడికల్ విద్యార్థులలో నూతనోత్సాహం కానవస్తుంది. ఖర్చుల విషయంలో ఆచి, తూచి వ్యవహరించండి. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించటం మంచిది. బంధు, మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల పెద్దలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, ఏ.సి. రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. చల్లని పానీయ, కూరగాయల వ్యాపారులకు కలిసిరాగలదు.
 
మీనం :- సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. మీ సంతానం విలాసాల కోసం ధనవ్యయం చేస్తారు. కళా, క్రీడా రంగాల్లో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు సదవకాశాలు చేజారిపోతాయి. మీకోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30-04-22 శనివారం రాశిఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో...