Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-05-22 సోమవారం రాశిఫలాలు - ఈశ్వరుడిని పూజించి అర్చించినా మీకు శుభం..

Advertiesment
astro8
, సోమవారం, 2 మే 2022 (04:00 IST)
మేషం:- ఆర్థికంగా అభివృద్ధి కానవచ్చిన ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి కావస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సజావుగా సాగుతాయి. చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
వృషభం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమికుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బంధువుల రాకతో ఖర్చులు అధికం. విదేశీయ వస్తువులు పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తులకు గుర్తింపు, రాణింపు లభిస్తాయి. ఎలక్ట్రానికల్, ఇన్వర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
మిథునం :- స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. కార్మికులకు, తాపీ పనివారికి సంతృప్తి కానరాదు. మీ కళత్ర వైఖరి మీకు చికాకు కలిగించగలదు. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. బంధువుల రాకతో ఖర్చులు అదుపు చేయాలనే మీ ఆలోచన ఫలించదు.
 
కర్కాటకం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. భవిష్యత్ గురించి పథకాలు వేసి జయం పొందుతారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
సింహం :- శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, మెళుకువ చాలా అవసరం. ఎగుమతి, దిగుమతి, రవాణా రంగాల వారికి సామాన్యం. కళా, క్రీడా రంగాల్లో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్యలకై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
కన్య :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. మీ హోదాను చాటుకోవటానికి ధనం బాగుగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులు తాత్కాలిక ఉద్యోగాల్లో నిలదొక్కుకుంటారు. స్త్రీల మనోభావాలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొంతమంది మీ సాన్నిత్యాన్ని కోరుకుంటారు.
 
తుల :- స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉపాధ్యాయులు మార్పులకై చేయుయత్నాలు ఫలిస్తాయి. నూతన పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. కాంట్రాక్టర్లు చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు, చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృశ్చికం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. బ్యాంకుల నుంచి పెద్ద మొత్తం ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. సమయానికి సహకరించని మిత్రుల వల్ల ఒకింత ఇబ్బందు లెదుర్కుంటారు.
 
ధనస్సు :- ఉద్యోగం చేయువారు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. గృహిణీలకు పనివాలతో సమస్యలు తలెత్తుతాయి. రుణ విముక్తులవుతారు. శ్రీవారు శ్రీమతి ఆర్యోగం పట్ల శ్రద్ధచూపిస్తారు. స్త్రీలు ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. వృత్తుల వారికి గుర్తింపుతో పాటు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
 
మకరం :- దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. తలచిన పనులలో కొంత అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది.
 
కుంభం :- స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి, ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఇంటికి అవసరమైన వస్తుసామగ్రి సమకూర్చుకుంటారు. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. గృహ మరమ్మతులలో ఏకాగ్రత వహించండి. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ, శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-05-2022 నుంచి 31-05-2022 వరకూ మీ మాస ఫలితాలు