Webdunia - Bharat's app for daily news and videos

Install App

18-09-2022 నుంచి 24-09-2022 వరకు మీ వార రాశిఫలితాలు (video)

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (15:54 IST)
Weekly astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
పంతాలు, భేషజాలకు పోవద్దు. లౌక్యంగా వ్యవహారం చక్కబెట్టుకోవాలి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బంధుత్వాలు బలపడతాయి. సోమ, మంగళ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య అకారణ కలహం. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ప్రణాళిలు వేసుకుంటారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆది, బుధ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గృహమార్పు అనివార్యం. పాత మిత్రులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు నిరాశాజనకం. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
కార్యం సిద్ధిస్తుంది. కొంతమొత్తం ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కుటుంబసౌఖ్యం పొందుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. శుక్ర, శని వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. అధికారులకు హోదామార్పు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
పరిస్థితులు మెరుగుపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీపై శకునాల ప్రభావం అషధికం. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధ్యాయులకు కష్టకాలం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయానికి నిరుత్సాహపడవద్దు. త్వరలో శుభవార్తలు వింటారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహ ఉంటుంది. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలకు ధనం అందుతుంది. పనులు ఆలస్యంగానైనా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మంగళ, బుధ వారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయతాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్మోగస్తులకు కష్టసమయం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. చిన్ననాటి పరిచయసులు తారసపడతారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ఈ వారం గ్రహాల అనుకూలత ఉంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ
సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. భూ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి.
 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
మీ భావాలను సున్నితంగా వ్యక్తం చేయండి. కొంత మంది మీ వ్యాఖ్యలను వక్రీకరిస్తారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఎవరినీ నొప్పించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు అనుకూలించవు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. పెద్దల సలహా పాటించండి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పర్మిట్లు, లైసెన్సులు మంజూరవుతాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కొంతమంది రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కోర్టువాయిదాలకు హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
వ్యవహార దక్షతతో రాణిస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అధికం. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. గృహం సందడిగా ఉంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతానం అత్యుత్సాహాని అదుపు చేయండి. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. మీ కృషితో వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగింవద్దు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి.
ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆప్తుల రాక ఉల్లాసం కలిగిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మంగళ, శని వారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బుధ, గురు వారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సోదరుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనలకు యత్నాలు సాగిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. బిల్డర్లకు ఒత్తిడి, శ్రమ అధికం. కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. పిల్లల వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. శుక్ర, శని వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఓర్పుతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. పత్రాల రెన్యువల్ లో మెలకువ వహించండి. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇళయరాజాకు ఆలయంలో అవమానం.. వీడియో వైర‌ల్

Daily Astro 16-12-2024 సోమవారం దినఫలితాలు : ఏకాగ్రతతో వాహనం నడపండి...

Today Daily Astro 15-12-2024 ఆదివారం దినఫలితాలు : సంకల్పం సిద్ధిస్తుంది...

Weekly Horoscope : 15-12-2024 నుంచి 21-12-2024 వరకు మీ రాశిఫలాలు

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

తర్వాతి కథనం
Show comments