Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-08-2022 నుంచి 20-08-2022 వరకు వార రాశిఫలాలు

Advertiesment
Weekly Astrology
, శనివారం, 13 ఆగస్టు 2022 (20:14 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అతిగా ఆలోచింపవద్దు. వ్యాపకాలు సృష్టించుకోండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సోమ, మంగళవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. సోదరుల ఆంతర్యం అవగతమవుతుంది. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు స్వాగతం పలుకుతారు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకం. వేడుకకు హాజరవుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అపరిచితులు తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. శుక్ర, శనివారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆహ్వానం అందుకుంటారు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసిరావు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టసమయం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పారిశ్రామిక రంగాల వారికి నిరాశాజనకం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా మెలగాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఆది, సోమవారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. పనులు ఒక పట్టాన పూర్తి కావు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు తప్పవు. సన్నిహితుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. నూతన వ్యాపారాలకు తగిన సమయం. వేడుకకు హాజరవుతారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష ఆకట్టుకుంటుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపుల జరుపుతారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ఈ వారం శుభదాయకం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
బంధుత్వాలు బలపడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తవుతాయి. పత్రాలు అందుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. విమర్శలు పట్టించుకోవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. పరిచయస్తులకు చక్కని సలహాలిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
ఆర్థికంగా బాగుంటుంది. రుణబాధలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహమార్పు కలిసివస్తుంది. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులను నమ్మవద్దు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. పాత పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు జ్ఞప్తికొస్తాయి. నిరుద్యోగులకు ఆశాజనకం. రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత వహించండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. అవకాశాలను వదులు కోవద్దు. కొంతమంది వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. శనివారం నాడు ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితమిస్తాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉపాధి పథకాలపై దృష్టి పెడతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికారులకు హోదామార్పు, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. దూర ప్రయాణం తలపెడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆర్థిక సమస్యలు వెన్నాడుతాయి. అంచనాలు ఫలించవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. అతిగా ఆలోచింపవద్దు. మనోధైర్యంతో మెలగండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో ఒత్తిడి అధికం. బుధ, గురువారాల్లో దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. కార్మికులు, వ్యవసాయ కూలీలకు నిరాశాజనకం. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
అనుకూలతలు నెలకొంటాయి. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. శుక్ర, శనివారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వేడుకకు హాజరవుతారు. ఆత్మీయుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. నోటీసులు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధ్యాయుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. దూరపు బంధువుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. పెట్టుబడులకు సమయం కాదు. ఆది, గురువారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. సంతానం ధోరణి చికాకుపరుస్తుంది. అనునయంగా మెలగండి. దంపతుల మధ్య దాపరికం తగదు. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-08-2022 శనివారం దినఫలాలు - అనంతపద్మనాభస్వామిని పూజించిన...