Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-08-2022 నుంచి 13-08-2022 వరకు మీ వార రాశిఫలాలు (video)

Advertiesment
horoscope
, శనివారం, 6 ఆగస్టు 2022 (22:12 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆది, సోమవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. పాత పరిచ సమాచారం ఉత్తేజపరుస్తుంది. ధార్మిక విషయాలపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
ఆశావహదృక్పథంతో మెలగండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం ఖాయం. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. ఆదాయం సంతృప్తికరం. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రలోభాలకు లొంగవద్దు. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ ఆలోచనలను కొంతమంది నిరుగారుస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. నోటీసులు అందుకుంటారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యవసాయ తోటల రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలను విరమించుకోవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవద్దు. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా మెలగండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహమార్పు నిదానంగా సత్ఫలితమిస్తుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. బుధ, గురువారాల్లో చేసిన పనులే చేయవలసి వస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఆరోగ్యం సంతృప్తికరం. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమ అధికం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. సంప్రదింపులు కొత్త ములుపు తిరుగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థలో మదుపు తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అపరిచితులు మోసగించేందుకు యత్నిస్తారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో శ్రద్ధ వహించండి. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం వాయిదా పడిన మొక్కులు తీసుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
ఈ వారం కలిసివచ్చే సమయం. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అంచనాలు ఫలిస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. శుభకార్యానికి హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషాన్నిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. భేషజాలు, పంతాలకు పోవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యసాధనలో సఫలీకృతులవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. భాగస్వామిక వ్యాపారాలకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రవాణా రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి.


తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
అనుకూలతలు నెలకొంటాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవమర్యాదలు పెంపొందుతాయి. వాగ్దాటితో నెట్టుకొస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆది, గురువారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. పాత పరిచయస్తులు తారసపడతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొంత మందికి అపోహ కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మంగళ, బుధవారాల్లో హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సానునయంగా మెలగండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంతగా తెలియజేయండి. భాగస్వామిక వ్యాపారాలు కలిసివస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. సాంకేతిక, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
అనుకూలతలు అంతంత మాత్రమే. రావలసిన ధనం సమయానికి అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. నిస్తేజానికి లోనవుతారు. గురు, శుక్రవారాల్లో పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. మీపై శకునాల ప్రభావం అధికం. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గృహవాతావరణం నిరుత్సాహపరుస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టకాలం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. అధికారులకు ఒత్తిడి అధికం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువలో అలక్ష్యం తగదు. ఆది, మంగళవారాల్లో బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. పెట్టుబడులు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
అన్ని విధాలా బాగుంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు ధనం అందుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆశించిన పదవులు దక్కవు. ప్రత్యర్థులతో జాగ్రత్త. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు అనుకూలం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. నూతన వ్యాపారాలు చేపడతారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు హోదామార్పు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, శ్రమ అధికం. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-08-2022 శనివారం దినఫలాలు - సత్యనారాయణస్వామిని ఆరాధించిన...