Webdunia - Bharat's app for daily news and videos

Install App

04-07-2021 నుంచి 10-07-2021 వరకు మీ వార రాశి ఫలితాలు

Webdunia
ఆదివారం, 4 జులై 2021 (00:51 IST)
Astrology
మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడులు కలిసిరావు. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో వ్యవహరించండి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. గృహమార్పు అనివార్యం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయ. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అనుభవజ్ఞుల సలాహా పాటించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సొంత పరిత్రానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు కష్టకాలం. కార్మికులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు.  శుభకార్యానికి హాజరవుతారు. ప్రయాణం వాయిదా పడుతుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
సమస్యలను ధీటుగా ఎదుర్కొంటారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. బుధవారం నాడు అప్రమత్తంగా వుండాలి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా వుంచండి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సోదరులతు సత్సంబంధాలు నెలకొంటాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వైద్య, సేవా రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. పందాలు, బెట్టింగ్‌ల జోలికిపోవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు.  పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కష్టం వృధాకాదు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం సంతృప్తి. ప్రణాళికలు వేసుకుంటారు. గురు, శుక్రవారాల్లో పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. వాగ్వాదాలకు దిగవద్దు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ ఇష్టాయిష్టాలను పెద్దల ద్వారా తెలియజేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఉమ్మడి వ్యాపారాలకు తరుణం కాదు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, ఆందోళన అధికం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కుటుంబీకుల ప్రోత్సాహం వుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. శనివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఆప్తుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. గృహమార్పు అనివార్యం. విద్యా, వైద్య సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్‌సేల్ వ్యాపారులకు కష్టకాలం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలతో సతమతమవుతారు. మీకోపతాపాలు అదుపులో వుంచుకోండి. ఎవరినీ నిందించవద్దు. అనుకోని ఖర్చులు మనస్థిమితం లేకుండా చేస్తాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆది, మంగళవారాల్లో అప్రమత్తంగా వుండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. ఆత్మీయుల సలహా పాటించండి. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడుతాయి. సంతానం ఉన్నత భవిష్యత్తుపై దృష్టి సారించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు, అధికారులకు ఒత్తిడి తప్పదు. విద్యా, వైద్య సంస్థలకు ఆశాజనకం. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం వున్నాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా వుంచండి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. సోమ, బుధవారాల్లో అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు హోదామార్పు, ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు తరుణం కాదు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. ఎంతటివారినైనా ఇట్టే  ఆకట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గురువారం నాడు పనులు, బాధ్యతలు ఇతరుకు అప్పగించవద్దు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. మీ జోక్యం అనివార్యం. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపదిస్తారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. భాగస్వామిక వ్యాపారాలు కలిసిరావు. కార్మికులు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
ఆర్థిక సమస్యలు వెన్నాడుతాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. అన్యమస్కంగా గడుపుతారు. వ్యాపకాలు సృష్టించుకోవడం ఉత్తమం. వీలైనంత వరకు ఆప్తులతో కాలక్షేపం చేయండి. అతిగా ఆలోచించవద్దు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆది, సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. నోటీసులు అందుకుంటారు. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలు పట్టించుకోండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. శుభకార్యానికి హాజరవుతారు. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.
ఈ వారం అప్రమత్తంగా వుండాలి. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. దుబారా ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సహాయం ఆశించి భంగపాటుకు గరవుతారు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. వాస్తుకు అనుగుణంగా గృహమరమ్మతులు చేపడతారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఇతరుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. విదేశాల్లోని అయినవారి క్షేమం తెలుసుకుంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులతో తీరిక వుండదు. పంతాలు, పట్టుదలకు పోవద్దు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సంతానం మొండి వైఖరి అసహనం. కలిగిస్తుంది. శుభకార్యానికి వెళ్లాలనిపించదు. మీ అశక్తతను బంధుమిత్రులు అర్థం చేసుకుంటారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల ప్రోత్సాహం వుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు బాధ్యతల మార్పు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఉత్సాహంగా ముందుకు సాగండి. సంప్రదింపులతో తీరిక వుండదు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కువగా అంచనా వేయొద్దు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తవుతాయి. ఖర్చులు అదుపులో వుండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. మంగళ, బుధవారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ముఖ్యం. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

తర్వాతి కథనం
Show comments