Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

01-07-2021 నుంచి 31-07-2021 వరకూ మీ మాస ఫలితాలు

01-07-2021 నుంచి 31-07-2021 వరకూ మీ మాస ఫలితాలు
, బుధవారం, 30 జూన్ 2021 (23:50 IST)
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా వుంటుంది. పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఈ మాసం యోగదాయకం. వాగ్దాటితో నెట్టుకొస్తారు. వ్యవహారాలు మీ చేతులు మీదుగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దంపతుల మధ్య సఖ్యతలోపం. పంతాలకు పోవద్దు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన మంచిది. సంతానం పైచదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులకు శుభయోగం. నూతన అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలుచేస్తారు. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. చేతివృత్తుల వారికి సామాన్యం. విదేశీయాన యత్నాలు విరమించుకుంటారు.
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడులు కలిసిరావు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. సంప్రదింపులకు అనుకూలం. పనులు సకాలంలో పూర్తికాగలవు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అభియోగాలు ఎదుర్కొంటారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు సక్రమంగా వుంటాయి. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం ఆశాజనకం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ధనలాభం వుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఎవరి సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సంస్థల స్థాపనకు తరుణం కాదు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా వుండాలి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంతమాత్రమే. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. పెద్ద ఖర్చు ఆస్కారం వుంది. ధనం మితంగా వ్యయం చేయండి. ఒక ఆహ్వానం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. మొండిగా పనులు పూర్తిచేస్తారు. సన్నిహితుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి. సహోద్యోగులకు సాయం అందిస్తారు. పందాలు, జూదాలకు పాల్పడవద్దు.
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆర్థిక విషయాలు ఏకరవు పెట్టవద్దు. శుభకార్యాన్ని సాదాసీదాగా పూర్తిచేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. గృహమార్పు అనివార్యం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. చిరు వ్యాపారులు, కార్మికులకు కష్టకాలం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వృత్తి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ బాగుంటుంది. వ్యవహారాలు కలిసివస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాటపై ఎదుటివారికి గురి కుదురుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆశాజనకం. వాయిదా పడిని మొక్కులు తీర్చుకుంటారు.
 
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ప్రతికూలతలు క్రమంగా తొలగుతాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పనులు సానుకూలమవుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. పత్రాలు అందుకుంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. అపరిచితులు మోసగించే ఆస్కారం వుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకునిల్వ తగదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
ధనుర్ రాశి: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. రావలసిన ఆదాయం ఆలస్యంగా అందుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఏ విషయంపై ఆసక్తి వుండదు. కీలక పత్రాలు అందుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. దంపతుల ఆలోచనలు పరస్పరం విరుద్దంగా వుంటాయి. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. పనులు అర్థంతరంగా ముగిస్తారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఇంటి విషయాలపై నిర్లక్ష్యం తగదు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. శుభకార్యానికి హాజరు కాలేరు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు కష్టకాలం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధి పథకాలు సంతృప్తినీయవు. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు. ఆచితూచి వ్యవహరించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. దంపతుల మధ్య సఖ్యతలోపం. ఆత్మీయుల హితవు మీపై మంచిప్రభావం చూపుతుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. చేతివృత్తులు, కార్మికులకు కష్టకాలం. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంమాత్రమే. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. కొన్ని సంఘటనలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. దంపతుల మధ్య అవగాహనలోపం. సామరస్యంగా మెలగాలి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గృహమార్పు ఫలితం నిదానంగా కలిసివస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తరుచూ దైవకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. వృత్తులు, కార్మికులకు సామాన్యం. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి.
 
మీనరాశి: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా వుంటుంది. ఆప్తులకు ముఖ్యసమాచారం అందిస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. సంస్థల స్థాపనకు అనుకూలం కాదు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సామాన్య ఫలితాలే యిస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్వ దర్శనానికి మోక్షమెప్పుడో... గత 79 రోజులుగా దర్శనభాగ్యం కరువాయే..