Webdunia - Bharat's app for daily news and videos

Install App

11-10-2020 నుంచి 17-10-2020 వరకు మీ వార రాశి ఫలితాలు ఇలా వున్నాయి- video

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (09:25 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. బంధువుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యతా లోపం. ఆగ్రహావేశాలు ప్రదర్శించవద్దు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ద వహించాలి. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితమీయవు. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ వారం పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పెద్దల సలహా పాటించండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. గృహ నిర్మాణాలకు ఆమోదం లభిస్తుంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. చేతి వృత్తులు, కార్మికులకు ఆశాజనకం. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రేమానుబంధాలు బలపడుతాయి. వాగ్దాటితో రాణిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. శని, ఆది వారాల్లో ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రముఖులతో పరిచయాలు బలపడుతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూ రప్రయాణం తగదు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహార దక్షతతో రాణిస్తారు. అనుకూలతలున్నాయి. కష్టం ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. సోమ, మంగళ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. గృహంలో మార్పులుచేర్పులకు అనుకూలం. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు పనిభారం,విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక ఒప్పందాలకు అనుకూలం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్పెక్యులేషన్ రంగాల వారికి పురోభివృద్ధి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సలహాలు, సహాయాలు ఆశించవద్దు. బంధుమిత్రుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. బుధవారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరలతో సంప్రదిం పులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. వ్యాపారాలు సాగక విసుగు చెందుతారు. చిన్న వ్యాపారులకు కష్టకాలం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. కంప్యూటర్ సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఆర్థికంగా బాగున్నా వెలితిగా ఉంటుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమవుతారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్ద మొత్తం సహాయం తగదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. గురు, శుక్ర వారాల్లో ఊహంచని సంఘటనలు ఎదురవుతాయి. వాగ్వాదాలకు దిగవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ద వహించాలి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్పలితాలిస్తాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతి విషయంలో మీదే పైచేయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శనివారం నాడు పనులు సాగవు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. గృహ మరమ్మతులు చేపడుతారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రయాణం తలపెడతారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ధన యోగం, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. ఆది, సోమ వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కొంటారు. సరకు నిల్వలో జాగ్రత్త. చేతి వృత్తులు కార్మికులకు ఆదాయాభివృద్ధి. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1 వ పాదం
చాకచక్యంగా వ్యవహరంచాలి. కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సలహా పాటించండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆదాయానికి లోటుండదు. పనులు ముగింపునకు వస్తాయి. మంగళ, బుధ వారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. సంతానం మూలకంగా ఇబ్బందులెదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రైవేట్ సంస్థల్లోని ఉద్యోగులకు కష్టకాలం. ప్రేమ వ్యవహారం సుఖాంతమవుతుంది.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అయనవారి ప్రోత్సాహం ఉంటుంది. మాటతీరు ఆకట్టుకుంటుంది. సంబంధాలు బలపడుతాయి. వాహన యోగం, కుటుంబసౌఖ్యం పొందుతారు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గురు, శుక్ర వారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. సంతానం కదలికపై దృష్టి పెట్టండి. వస్త్ర, ప్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి సన్నాహాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. శనివారం నాడు పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించడానికి యత్నిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు బాధ్యతల మార్పు, పని భారం. వేడుకల్లో పాల్గొంటారు. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోండి. వాహనం ఇతరులకివ్వద్దు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. ఆది, సోమ వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. గృహంలో మార్పుచేర్పులు ఫలిస్తాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. న్యాయ, సేవా రంగాల వారికి పురోభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మున్ముందు మెరుగైన ఫలితాలిస్తాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. చేతి వృత్తులు, కార్మికులకు కష్టకాలం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments