Webdunia - Bharat's app for daily news and videos

Install App

02-09-2021 గురువారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించినా...

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (04:00 IST)
మేషం : దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఎదుటివారిని తమ వాక్‌చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు తోటివారితో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. 
 
వృషభం : మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. రాబడికి మించిన ఖర్చుల వల్ల ఆటుపోట్లు తప్పవు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
మిథునం : స్త్రీలకు ఆభరణాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాబడికిమించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. 
 
కర్కాటకం : బ్యాంకు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిలగవలసి వస్తుంది. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
సింహం : ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడక తప్పదు. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. కోర్టు వ్యవహారాలు, పరిష్కారమవుతాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. అధిక ధనంతో దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. 
 
కన్య : ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. కాంట్రాక్టర్లకు రావలిసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తు కుదరదు. ప్రైవేట, పత్రికా సంస్థల్లో వారికి మార్పులు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు తలెత్తే ఆస్కారం వుంది. 
 
తుల : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఖరీదైన వస్తు కొనుగోళ్ళలో ఏకాగ్రత అవసరం. గృహంలో మార్పులు వాయిదాపడతాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
వృశ్చికం : స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారలలో మెళకువ అవసరం. విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ సంతానం కోసం ధన బాగా వ్యయం చేస్తారు. 
 
ధనస్సు : వ్యాపారాలు లీజు, ఏజెన్సీ, కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు. కుటుంబీకుల మధ్య కొత్త ఆలోచనలు చర్చకు వస్తాయి. 
 
మకరం : ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళన అధికమవుతాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఆరోగ్యంలో మెళకువ వహించండి. 
 
కుంభం : భాగస్వామిక ఒప్పందాలు, ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలనిస్తాయి. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలోని వారికి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. వృత్తి వ్యాపారుల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
 
మీనం : ఆర్థిక సమస్యలు, ఇతర చికాకులు తొలగి మాసికంగా కుదుటపడతారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు తలకిందులవుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. అనుక్షణం మీ సంతానం విద్యా ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలు ఉంటాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

తర్వాతి కథనం
Show comments