Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

30-08-2021 సోమవారం దినఫలాలు - శ్రీకృష్ణుని దర్శించిన పూజించినా...

30-08-2021 సోమవారం దినఫలాలు - శ్రీకృష్ణుని దర్శించిన పూజించినా...
, సోమవారం, 30 ఆగస్టు 2021 (04:00 IST)
మేషం : కంది, మినుము, మిర్చి వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులకు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కార్మికులకు తాపీ పనివారు సమస్యలను ఎదుర్కొంటారు. దంపతులమధ్య కలహాలు తలెత్తుతాయి. వైద్యులకు ఏకాగ్రత చాలా అవసరం. వాహనం నిదానంగా నడపడం క్షేమదాయకం. 
 
వృషభం : ఏదైనా అమ్మకానికై చేయుయత్నం వాయిదావేయడం మంచిది. ముఖ్యులలో ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించండి. సోదరికి బహుమతులు అందజేస్తారు. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు ఒకంతట తేలకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. నిరుత్సాహం వీడి ఆత్మవిశ్వాసంతో యత్నాలు సాగించండి. 
 
మిథునం : ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఆత్మీయులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అనుకున్న పనులు అర్థాంతరంగా ముగిస్తారు. 
 
కర్కాటకం : కొంతమంది మిమ్మలను తప్పుదారి పట్టించి లబ్ది పొందడానికై యత్నిస్తారు. సంఘంలో ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయం మీ ఉన్నతికి సహకరిస్తాయి. ప్రైవేటు సంస్థల్లో వారికి ఓర్పు, నేర్పుతో ఎంతో అవసరం. దైవ, సేవా పుణ్య కార్యాల్లో నిమగ్నమవుతారు. చేతి వృత్తి, వ్యాపారుల వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
సింహం : బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి పురోభివృద్ధి. రవాణా ఆటో మొబైల్, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తికానరాదు. 
 
కన్య : వస్త్ర, బంగారం, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. మధ్య మధ్య ఔషధ సేవ తప్పదు. రావలసిన బకాయిలు విషయంలో మెళకువ అవసరం. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు. ప్రేమికులకు ఎడపాటు, చికాకులు తప్పవు. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మీ పురోభివృద్ధికి ఎంతగానో సహకరిస్తాయి. 
 
తుల : కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. స్నేహ పరిచయాలు విస్తరిస్తాయి. ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనవుతారు. అయినవారిని ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ముఖ్యుల కోసం షాపింగ్‌లు చేస్తారు. 
 
వృశ్చికం : మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. 
 
ధనస్సు : బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. స్త్రీలకు వీటి చానెళ్ల నుంచి ఆహ్వానం, పారితోషికం, బహుమతులు అందుతాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికం. చేపట్టిన పనులు అతికష్టంమ్మీద సమయానికి పూర్తి చేయగలుగుతారు. 
 
మకరం : ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో క్షణం తీరిక ఉండదు. పత్రికా సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయమే అన్ని విధాలా శ్రేయస్కరం. ధన వ్యయంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
కుంభం : కుటుంబ అవసరాలకు మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. అనుకోకుండా ఏర్పడిన ఒక స్నేహబంధం భవిష్యత్తులో మీకు మంచి చేస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. మనసు లగ్నం చేసి పనిపై శ్రద్ధ పెట్టినా ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 
 
మీనం : మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక ప్రయాణాల వల్ల ధనం అధికంగా వ్యయం చేస్తారు. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా కొనసాగుతాయి. అసలైన మీ లక్ష్యాలను చేరుకోవాలంటే పనిపై అంకితభావంతో పని చేయాల్సి ఉంటుంది. దంపతుల మధ్య ఏకీభావం సాధ్యంకాదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-08-2021 ఆదివారం దినఫలాలు - సూర్యుని ఆరాధించినా సర్వదా శుభం