Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

27-08-2021- శుక్రవారం మీ రాశి ఫలితాలు.. గోవుకు మినుములను..?

27-08-2021- శుక్రవారం మీ రాశి ఫలితాలు.. గోవుకు మినుములను..?
, శుక్రవారం, 27 ఆగస్టు 2021 (05:02 IST)
గోవుకు మినుములను అరటి ఆకులో ఆహారంగా పెట్టినా శుభం.
 
మేషం: హోటల్, తినుబండారాలు, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివద్ధి. స్త్రీలకు పనిభారం అధికం. ముక్కుసూటిగా మాట్లాడే మీ తీరు ఇబ్బందులకు దారి తీస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
వృషభం: ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబరచటం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కోక తప్పదు. స్త్రీలకు సంఘంలో గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లోని వారికి పార్టీ పరంగా అన్ని విధాలా కలిసి రాగలదు. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆపత్సమయంలో సన్నిహితులు గుర్తుకొస్తారు. 
 
మిథునం : మీ శ్రీమతి అవసరాలు కోరికలు తీరుస్తారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటారు. స్త్రీల అభిప్రాయాలకు ఏమాత్రం స్పందన వుండదు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనిభారం అధికం. 
కర్కాటకం : వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. అర్థాంతంగా ముగించాల్సిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీతో సఖ్యతగా నటిస్తూనే తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. 
 
సింహం : రాజకీయాల్లో వారు కొన్ని అంశాలపై చర్చ జరపటం వల్ల జయం చేకూరుతుంది. స్త్రీలకు ఆలయాల్లో సందర్శనాలలో నూతన పరిచయాలేర్పడతాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. కొన్ని నచ్చని సంఘటనలెదురైనా భరించక తప్పదు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. 
 
కన్య : ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి వుంటుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది. 
 
తుల: వ్యవసాయ, తోటల రంగాల వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. ప్లీడర్లకు, ప్లీర్ గుమాస్తాలకు అనుకూలమైన కాలం. విగేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త. 
 
వృశ్చికం: సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చులు మీ స్తోమతకు తగినట్లుగా ఉంటాయి. ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. ప్రైవేట్, పత్రిక సంస్థల్లోని వారికి, రిప్రజెంటేటివ్‍‌లకు ఒత్తిడి, పనిభారం సమస్యలు తప్పవు. 
 
ధనస్సు : దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు నూతన పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడతాయి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కుతాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
 
మకరం: నరాలు, పొట్ట, కాళ్లకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. అధైర్యం వదిలి ధైర్యంతో ముందుతు సాగండి. సామాజిక, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. 
 
కుంభం : పారిశ్రామిక రంగాల్లో వారికి కార్మికులతో ఒప్పందం కుదురుతుంది. దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. ఆగ్రహావేశాలను అదుపులో వుంచుకోవడం శ్రేయస్కరం. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
మీనం: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ప్రయాణాలు అనకూలిస్తాయి. కష్ట సమయంలో అయిన వారే ముఖం చాటేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నూతన వధూవరులకు అరుంధతీ నక్షత్రం ఎందుకు చూపిస్తారు?