Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22-08-2021 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్యుడిని మంకెన పూలతో..?

Advertiesment
22-08-2021  ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆదిత్యుడిని మంకెన పూలతో..?
, ఆదివారం, 22 ఆగస్టు 2021 (05:00 IST)
ఆదిత్యుడిని మంకెన పూలతో పూజిస్తే సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. మత్స్య, కోళ్ల వ్యాపారస్తులకు కలిసివస్తుంది. రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రియతముల రాక సమాచారం మీకు సంతోషం కలిగిస్తుంది. తలపెట్టిన పనుల్లో ఆర్థికాభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది. 
 
వృషభం: ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. మీ సంతానంతో కలిసి నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. తొందరపడి వాగ్ధానాలు చేసి సమస్యలకు గురికాకండి. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లోనూ, దూర ప్రయాణాల్లో మెళకువ అవసరం. 
 
మిథునం: కుటుంబీకుల కోసం నూతన పథకాలు వేస్తారు. రావలసిన ధనం చేతికి అందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, వ్యాపారస్తులకు లాభదాయకం. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
 
కర్కాటకం: ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్రేమికుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. ఏ విషయంలో హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి.
 
సింహం: మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం, సహకారం అందిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారులకు సమస్యలు ఎదురైనా ఆదాయానికి కొదవ వుండదు. ప్రముఖులతో సభా సమావేశాల్లో పాల్గొంటారు.
 
కన్య: అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కుంటారు. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా వుంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనివారలతో చికాకులు తప్పవు.
 
తుల: శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.
 
వృశ్చికం: హోటల్ తినుబండరాల వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. బంధుమిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. సహోద్యోగులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
ధనస్సు: శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. కోళ్ళ, గొర్రె, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి.
 
మకరం: బృంద కార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. దైవ దర్శనాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రకటనలు, ప్రచురలణలకు ఏర్పాట్లు చేస్తారు. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. విద్యార్థులు క్రీడలు, ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనబర్చడం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కోక తప్పదు. 
 
కుంభం: ఆర్థికంగా బలం చేకూరుతుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ఇరుగుపొరుగు వారి వైఖరి వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. బంధువులతో చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారం వుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి.
 
మీనం: మీ ప్రత్యర్థుల తీరు మీకు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తాం?