Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

31-08-2021 మంగళవారం దినఫలాలు - వేణుగోపాల స్వామిని ఆరాధించినా...

Advertiesment
31-08-2021 మంగళవారం దినఫలాలు - వేణుగోపాల స్వామిని ఆరాధించినా...
, మంగళవారం, 31 ఆగస్టు 2021 (04:00 IST)
మేషం : దైవ కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దేనిమీదా శ్రద్ధ వహించలేరు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యంకాదు. సొంత నిర్ణయాల వల్ల కలహాలు, చికాకులు తప్పవు. 
 
వృషభం : మీపై శకునాల ప్రభావం అధికమవుతుంది. మీపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం అధికంగా ఉంటుంది. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖ సంస్థల షేర్ల కొనుగోళ్లు లాభిస్తాయి. చిట్స్, ఫైనాన్స్, రంగాల వారికి ఖాతాదారుల నుంచి ఒత్తిడి తప్పదు. స్త్రీలు విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. 
 
మిథునం : ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్ల విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ధనవ్యయం అధికమైన ఇబ్బందులు ఉండవు. వాయిదాపడిన పనులు పూర్తిచేస్తారు. 
 
కర్కాటకం : వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఊహించని ఖర్చులు, చెల్లింపులు వల్ల ఇబ్బందులు తప్పవు. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. 
 
సింహం : వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. మీ వాక్చాతుర్యతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తిచేస్తారు. 
 
కన్య : ఎల్.ఐ.సి. బ్యాంకు డిపాజిట్లు సంబంధించిన సొమ్ము అందుకుంటారు. ఎదుటివారు మిమ్మలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా నిగ్రహించుకోవడం మంచిది. లక్ష్యసాధనంలో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా కష్టపడాలి. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. 
 
తుల : గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానం అందుతుది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపార, వ్యవహారాల్లో నిర్మొహమాటంగా వ్యవహరించండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసంతో మీ  యత్నాలు సాగించండి.
 
వృశ్చికం : వ్యవసాయ రంగాల వారికి ఎరువుల కొనుగోలులో చికాకులు తప్పవు. అద్దెలు, ఇతరాత్రా రావలసిన  బకాయిల వసూలులో దూకుడుగా వ్యవహరించకండి. స్టాక్ మార్కెట రంగాల వారికి మిశ్రమ ఫలితం. సానుకూల ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. మీ సమస్యలు, చికాకులు క్రమంగా సర్దుకుంటాయి. 
 
ధనస్సు : మీ ప్రయాణాలు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాల్లో నష్టాలను కొంత వరకు భర్తీచేసుకోగలుగుతారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. 
 
మకరం : ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల సమర్థత, అంకిత భావం అధికారులను ఆకట్టుకుంటాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
కుంభం : బంధువులు, సోదరీ, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ మాటకు ఇంటా బయటా గౌరవం లభిస్తుంది. ఏ వ్యక్తినీ తక్కువగా అంచనా వేయకండి. స్త్రీల పేరిట స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా సాగుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలు దూరంగా ఉండటం మంచిది. 
 
మీనం : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం వుంది. గృహ మార్పుల కోసం యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో తోటివారి సహకారం లభిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో క్రిష్ణాష్టమి వేడుకలు