Webdunia - Bharat's app for daily news and videos

Install App

03-01-2022 సోమవారం దినఫలాలు - ఈశ్వరునికి అభిషేకం చేయించి తీర్థం సేవిస్తే...

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (04:00 IST)
మేషం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఫీజులు, బిల్లులు చెల్లింపుల విషయంలో సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. బంధువులను కలుసుకుంటారు. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.
 
వృషభం :- ఉద్యోగస్తులకు బాధ్యతలు ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు. పెద్ద మొత్తంలో చెక్కులిచ్చే విషయంలో పునరాలోచన మంచిది. జీవిత భాగస్వామితో తలెత్తిన వివాదాలు క్రమేణా సమసిపోతాయి. మీ వాక్చాతుర్యం, మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి.
 
మిథునం :- పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన ఫైళ్ల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. రాజకీయాల్లో వారు విరోధులు వేసే పథకాలను తెలివితో ఎదుర్కొంటారు. కొంత మొత్తమైనా పొదుపు చేయాలన్న మీ కోరిక ఫలిస్తుంది.
 
కర్కాటకం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఖచ్చితంగా మాట్లాడటం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. అన్ని రంగాల వారికీ మొదట నిరాశ కలిగినా తర్వాత పురోభివృద్ధి, జయం పొందుతారు.
 
సింహం :- స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటం మంచిది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
కన్య :- కాంట్రాక్టర్లకు రావలసిన ధనం సకాలంలో అందకపోవడంతో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు చురుకుగా సాగుతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చెల్లింపులు, బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి.
 
తుల :- వృత్తి ఉద్యోగాల్లో మీ సేవలకు గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరొక కార్యానికి వినియోగించవలసి వస్తుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఎల్.ఐ.సి, పోస్టల్, ఇతర ఏజెంట్లకు ఆశాజనకం. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, చికాకులు తప్పవు.
 
వృశ్చికం :- బ్యాంకు పనులు చికాకులను కలిగిస్తాయి. మనుష్యుల మనస్థత్వము తెలిసి మసలు కొనుట మంచిది. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనసహాయం, ధనవ్యయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. సోదరీ సోదరుల తీరు అసహనం కలిగిస్తుంది.
 
ధనస్సు :- ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారు చికాకులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. ఉద్యోగయత్నాలలో విజయం సాధిస్తారు. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలు టీవీ కార్యక్రమాలు, పోటీల్లో రాణిస్తారు.
 
మకరం :- రవాణా రంగాల వారికి మెళుకువ, ఏకాగ్రత అవసరం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారు మితంగా మాట్లాడి పనియందు ధ్యాస వహించాలి. పాత బాకీలు తీరుస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాలను ఖచ్చితంగా తెలియజేయండి.
 
కుంభం :- శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. మీ పనులు, రోజువారీ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు పెండింగ్ పనుల పూర్తిలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు ఏమంత సంతృప్తినీయవు.
 
మీనం :- బ్యాంకు పనుల్లో జాప్యం ఇతర పనులపై ప్రభావం చూపుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించడం ముఖ్యం. స్త్రీలకు చుట్టుప్రక్కలవారితో మనస్పర్థలు తలెత్తినా తేలికగా పరిష్కరిస్తారు. ఇంట హడావుడి తగ్గటంతో మీలో నిస్తేజం చోటుచేసుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

కలలో గణేషుడు కనబడితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments