Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

30-12-2021 గురువారం దినఫలాలు - వినాయకుడిని ఆరాధించిన సంకల్పసిద్ధి...

Advertiesment
Daily Horoscope
, గురువారం, 30 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- రవాణా, ఎక్స్‌పోర్టు రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. రాజకీయ నాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలకు విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. మీ ఏమరపాటుతనం వల్ల పత్రాలు, విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
వృషభం :- ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కుంటారు. దైవదర్శనాలవల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. ఏదైనా వస్తువు కొనుగోలుకు షాపింగ్ చేస్తారు. వ్యవహార సానుకూలతకు బాగా శ్రమిస్తారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.
 
మిథునం :- స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో స్వల్ప చికాకులు ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది. పాత వస్తువులను కొనిసమస్యలు తెచ్చుకోకండి.
 
కర్కాటకం :- ధనం ఏ మాత్రం పొదుపు చేయకున్నా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏది ఉండదు. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు అయిన వారి ఆరోగ్యం కలవరపరుస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. రాజకీయనాయకులు సభలు, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
సింహం :- తొందరపాటుతనం వల్ల ఇబ్బందుల్లో పడే ఆస్కారం ఉంది. స్త్రీల ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధబాంధవ్యాలు బలపడతాయి. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువులతో పట్టింపులు, చికాకులు ఎదుర్కుంటారు.
 
కన్య :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఓర్పు, నేర్పు, అంకితభావంతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏదన్నా అమ్మకానికై చేయుప్రయత్నాలు వాయిదా పడతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు.
 
తుల :- వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బ్యాంకుల్లో మీ పనులకు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత చాలా అవసరం. రిప్రజెంటేటివ్‌లకు సదావశాలు లభిస్తాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవటం మంచిది కాదు.
 
ధనస్సు :- రుణం సమయానికి సమకూరడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తగలవు. దంపతుల మధ్య కలహాలు తలెత్తగలవు. వ్యాపారాల్లో కొత్త కొత్త మెళకువలు గ్రహిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. మిమ్ములను కాదన్నవారే మీకు చేరువయ్యేందుకు యత్నిస్తారు.
 
మకరం :- ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటగలవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆ లౌకిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. కొత్త భాగస్వాములను చేర్చుకునే విషయంలో పునరాలోచన మంచిది. రవాణా, ఎక్స్‌పోర్ట్ రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు.
 
కుంభం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు వాయిదా పడతాయి. నిర్మాణ కార్యక్రమాలలో ప్రోత్సాహం కానవస్తుంది. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారితో చికాకులు తలెత్తుతాయి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ వాహనం, ఇతర విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి.
 
మీనం :- పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగుతాయి. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. స్త్రీలకు పనివారలతో చికాకు, ఒత్తిడి తప్పవు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచటం శ్రేయస్కరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29-12-2021 బుధవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం...