Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

29-12-2021 బుధవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం...

Advertiesment
29-12-2021 బుధవారం దినఫలాలు - ఉమాపతిని ఆరాధించిన శుభం...
, బుధవారం, 29 డిశెంబరు 2021 (04:00 IST)
మేషం :- ఉపాధ్యాలయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సోదరులతో మనస్పర్థలు తలెత్తుతాయి. పత్రికా రంగంలో వారికి కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.
 
వృషభం :- వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మిథు :- రేపటి కార్యక్రమాల గురించి ఈరోజే ఆలోచించి క్రియారూపంలో పెట్టండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఒత్తిడి, సమస్యలు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఎటువంటి సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకొండి.
 
కర్కాటకం :- తల పెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ప్రేమికుల అనాలోచిత చర్యల వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, విశ్రాంతి లభిస్తాయి. హోటల్ తినుబండ వ్యాపారస్తులకు సంతృప్తి చేకూరుతుంది. గృహంలో మార్పులు చేర్పులు వాయిదా పడతాయి.
 
సింహం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి.
 
కన్య :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతాయి. మీ ఏమరపాటు తనం వల్ల పత్రాలు విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, టెక్నికల్ రంగాల్లో వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళుకువ అవసరం. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత చాలా అవసరం.
 
తుల :- ఆలయ సందర్శనాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఆస్తి వ్యవహారాల్లో ముఖ్యులతో విభేదాలు తలెత్తుతాయి. ప్రముఖుల కలయికతో ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.
 
వృశ్చికం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. దంపతుల మధ్య అపార్థలు, చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రైవేటు సంస్థలలో వారికి సామాన్యంగా ఉంటుంది.
 
ధనస్సు :- చిన్న తరహా పరిశ్రమ, కుటీర పరిశ్రమల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. ఉద్యోగస్తులకు అధికారుల గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు.
 
మకరం :- ఖర్చులు అధికం, రుణాలు, చేబదుళ్ళు తప్పక పోవచ్చు. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పాత వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. లక్ష్య సాధనకు విద్యార్ధులు మరింతగా శ్రమించాలి.
 
కుంభం :- ఉపాధ్యాయులకు చికాకు, విద్యార్థులకు సంతృప్తి చేకూరుతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. యాధృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కొంతమంది మీ నుంచి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు. వైద్య, ఇంజనీరింగ్ రంగంలో వారికి మెళుకువ అవసరం.
 
మీనం :- కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. స్త్రీలకు తల, కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. కొన్ని పనులు అసంకల్పితంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల రాకపోకవల్ల అసౌకర్యానికి లోనౌతారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్సనాలకు అన్ని ఏర్పాట్లు చేశాం: అదనపు ఈఓ ధర్మారెడ్డి