Webdunia - Bharat's app for daily news and videos

Install App

30-08-2022 మంగళవారం దినఫలాలు - నారాయణ స్వామిని ఆరాధించినా...

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (04:00 IST)
మేషం :- ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు తప్పవు. సభ, సన్మానాలలో చురుకుగా పాల్గొంటారు.
 
వృషభం :- మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. విద్యార్థులు అల్లర్లు, ఆందోళనలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. వ్యాపారాల్లో అమలు చేసిన పథకాలు మునుముందు మంచి ఫలితాలిస్తాయి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిదికాదు.
 
మిథునం :- మీ తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు, ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్ల, తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులవల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గృహోపకరణాలు అమర్చుకుంటారు.
 
కర్కాటకం :- కుటుంబీకుల మధ్య అవగాహన, ఏకాభిప్రాయం సానుకూల మవుతాయి. సమయస్ఫూర్తితో ఒక సమస్యను అధిగమిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్తోమతుకు మించిన వాగ్దానాల వల్ల ఇబ్బందు లెదర్కుంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి.
 
సింహం :- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడివల్ల ఆందోళనలకు గురవుతారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం నెరవేరగలదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశమైనా సద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
కన్య :- ఫైనాన్సు, వ్యాపారులు మొండి బాకీల మీద దృష్టి ఉంచండి. మీతో సఖ్యత నటిస్తూనే తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. అందరికి సహాయం చేసి మాటపడతారు. పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
తుల :- ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ మతిమరుపు ఇబ్బందులకు దారితీస్తుంది. కొన్ని నచ్చని సంఘటనలెదురైనా భరించక తప్పదు. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరా లెదుర్కోవలసి వస్తుంది. ఖర్చులు ఊహించినవే కావటంతో మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానే సిద్ధం చేసుకుంటారు.
 
వృశ్చికం :- వాణిజ్య ఒప్పందాలు, బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో ఏకాగ్రత అవసరం. పట్టువిడుపు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారం కాగలవు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్లీడర్లకుతమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
ధనస్సు :- స్త్రీల పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు సమస్యలు తలెత్తుతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
మకరం :- కాంట్రాక్టుదారులకు ఆందోళనలు కొన్ని సందర్భములందు ధననష్టము సంభవించును. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. కొత్త షేర్ల కొనుగోళ్ళలో పునరాలోచన అవసరం. ఆరోగ్యములో ఆకస్మిక ఆందోళనతప్పదు.
 
కుంభం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మిత్రుల కోసం షాపింగ్ చేస్తారు.
 
మీనం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. ఉద్యోగస్తులు, రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌కు వరాలు జల్లు సరే... ఏపీని ఎందుకు విస్మరించారు : జైరాం రమేష్

ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఉపశమనం.. చనిపోయే హక్కు అమలు.. ఎక్కడ?

Amphex 2025: ఆంఫెక్స్ 2025.. కర్ణాటకలో ప్రత్యేక దళాలు కనువిందు (ఫోటోలు)

దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్... నిర్మలా సీతారామన్

అఖాడా నుంచి మమతాకులకర్ణి - లక్ష్మీనారాయణ్‌ ఔట్...

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..

30-01-2025 గురువారం దినఫలితాలు : ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

మౌని అమావాస్య వేళ త్రివేణి యోగం.. ఈ మూడు రాశులకు లాభాలు

29-01-2025 బుధవారం దినఫలితాలు : పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు...

తర్వాతి కథనం
Show comments