Webdunia - Bharat's app for daily news and videos

Install App

27-12-22 మంగళవారం మీ రాశిఫలాలు - కుబేరుడిని ఆరాధించడం వల్ల...

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (04:00 IST)
మేషం :- ఒక నష్టాన్ని మరో విధంగా పూడ్చుకుంటారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు కలిసివస్తుంది. బంధు మిత్రులను ఆహ్వానిస్తారు. కుటుంబ సభ్యులతో కలసి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు నూతన పరిచయాలు ఏర్పడతారు.
 
వృషభం :- ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఎదుటివారితో మితంగా సంభాషించటంమంచిది.
 
మిథునం :- అవసరాలకు ధనం సర్దుబాటు చేసుకోగలుగుతారు. విందులలో పరిమితి పాటించండి. పెద్దమొత్తం ధనం డ్రా చేసేటపుడు జాగ్రత్త అవసరం. వ్యాపారాల్లో ఆటుపోట్లు, పోటీని ధీటుగా ఎదుర్కుంటారు. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్యను అధిగమిస్తారు. 
 
కర్కాటకం :- మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. పెద్దల ఆరోగ్యంలో ఆందోళన తప్పదు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. వాతావరణంలోని మార్పులు ఆందోళన కలిగిస్తాయి.
 
సింహం :- విందులలో పరిమితి పాటించండి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మిత్రులను విందుకు ఆహ్వానిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులకతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొత్త సమస్యలుతలెత్తుతాయి.
 
కన్య :- దేవాలయ, విద్యా సంస్థలకు దాన ధర్మాలు చేయడంవల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మిత్రులను ఆహ్వనిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ పలుకుబడి, వ్యవహార దక్షతతో అనుకున్నది సాధిస్తారు. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం.
 
తుల :- భాగస్వామ్యుల మధ్య పరస్పర అవగాహన అభివృద్ధి కానవస్తుంది. ఇతరుల మెప్పుకోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొనవలసి వస్తుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రముఖులకు శుభాకాంక్షలు అందజేస్తారు. మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
 
వృశ్చికం :- మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. మీ సంతానం పై బరువు బాధ్యతలు పెరుగుతాయి. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రుల కలుసుకుంటారు. విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
మకరం :- మీ అభిప్రాయాలు గుట్టుగా ఉంచి ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. బంధువుల రాకతో పనులు మందకొడిగా సాగుతాయి. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ఖర్చులు అధికవుతాయి. విజ్ఞతతో మీ ఆత్మాభిమానం కాపాడుకుంటారు.
 
కుంభం :- స్త్రీలు ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. వస్త్రాలను కొనుగొలు చేస్తారు. బంధువులరాక వల్ల పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ఖర్చులు అదుపు చేయాలన్న మీ యత్నంఫలించదు.
 
మీనం :- ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరుతాయి. పెంపుడు జంతువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. వాహనం నడుపేటప్పుడు ఏకాగ్రత ముఖ్యం. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఏడాది 2025 ఫిబ్రవరి 1 నుంచి ఆంధ్రలో భూమి రిజిస్ట్రేషన్ ఫీజుల మోత

Telangana MLC Constituencies: తుది ఓటర్ల జాబితా విడుదల.. వివరాలివే..

Black Moon: డిసెంబర్ 31, 2024.. బ్లాక్ మూన్‌ని చూడొచ్చు.. ఎలాగంటే?

ఉగాది నుండి అమలులోకి మహిళలకు ఉచిత బస్సు పథకం?

అపుడు బూతులు తిట్టి.. ఇపుడు నీతులు చెబితే ఎలా? : పేర్ని నానిపై పవన్ కళ్యాణ్ ఫైర్ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

29-12-2024 ఆదివారం దినఫలితాలు -రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి...

శనివారం ప్రదోషం: సాయంత్రం పాలు, పెరుగు అభిషేకానికి సమర్పిస్తే?

Tirumala Facts: బంగారు గోపురం.. వైకుంఠం నుంచి నేరుగా కొండమీదకి దిగారట!

28-12-2024 శనివారం దినఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

Tirumala: తిరుమలలో అద్భుతం.. మంచు కొండల్లా మారిన ఏడు కొండలు (video)

తర్వాతి కథనం
Show comments