Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22-12-2022 గురువారం దినఫలాలు - దుర్గాసప్త శ్లోక పారాయణ చేయడం వల్ల..

Advertiesment
Weekly Astrology
, గురువారం, 22 డిశెంబరు 2022 (04:00 IST)
మేషం :- వృత్తుల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులు మార్పులకై చేయు యత్నాలు వాయిదా పడతాయి. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. విద్యార్థులకు అత్యుత్సాహం కూడదు. ప్రేమికుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
వృషభం :- బంధువుల రాకపోకలు అధికమవుతాయి. భాగస్వామిక వ్యాపారాలు, లీజు, నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. స్త్రీలకు అయిన వారి నుంచి ఆదరణ, సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో సఖ్యత నెలకొంటుంది. చిన్నతరహా, చిరు వ్యాపారులకు ఆశాజనకం. 
 
మిథునం :- ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు బలపడతాయి. ఆపత్సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
కర్కాటకం :- స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుపట్ల ఏకాగ్రత అవసరం. పన్నులు సకాలంలో చెల్లిస్తారు. ఆరోగ్య భంగం, సంతాన మూలక సమస్యలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం అధికమవుతుంది. ఓర్పు, రాజీ మార్గంలో మీ సమస్యలు పరిష్కరించుకోవాలి.
 
సింహం :- ఆదాయ, వ్యయయాలు సంతృప్తికరం. విద్యార్థులకు తోటివారితో సాన్నిత్యం ఏర్పడుతుంది. స్త్రీలకు ఆర్జన, సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక సమావేశాల్లో కొత్త అంశాలు చర్చకు వస్తాయి. రచయితలకు, పత్రికా రంగాల వారికి అనుకూలమైన కాలం. నిరుద్యోగులు నిరుత్సాహానికి లోనవుతారు.
 
కన్య :- ఉన్నత స్థాయి అధికారులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. హోటల్, కేటరింగ్, తినుబండ వ్యాపారులకు కలివచ్చే కాలం.
 
తుల :- ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి. సేవా సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. మొహమాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే అనుకున్నది సాధ్యమవుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనలు, ప్రయాణాలకు అన్ని విధాలా అనుకూలం. ధనం అధికంగా వ్యయం చేసినా ఒక మంచి పని చేసిన తృప్తి ఉంటుంది.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు తోటివారితో ఊహించని చికాకులు తలెత్తుతాయి. మార్కెట్ రంగాలవారికి మార్పులు అనుకూలిస్తాయి. పెద్దలను, ప్రముఖులను కలుసుకొని వారికి బహుమతులు అందజేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కలిసిరాగలవు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి.
 
ధనస్సు :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, బంగారు ఆభరణాలకు వ్యాపారులకు కలిసివచ్చే కాలం. నూతన వివాహితులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి.
 
మకరం :- ఉద్యోగస్తులకు, వృత్తుల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికి కుటుంబీకుల సహకారంతో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి అధికమవుతాయి.
 
కుంభం :- దైవదర్శనాలు అనుకూలిస్తాయి. గృహంలో మార్పులకై చేయుయత్నాలు కలిసిరాగలవు. శుభకార్యాల్లో ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. విద్యార్థినులకు పరీక్షల్లో ఏకాగ్రత, సమయపాలన చాలా అవసరం. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వస్తులాభం వంటి శుభఫలితాలున్నాయి. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.
 
మీనం :- ప్రతి విషయంలో ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికి ధైర్యంతో ముందుకు నడుస్తారు. రుణాలు, చేబదుళ్లు, అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. స్త్రీలు విందు, వినోదాలు, విలువైన వస్తువుల కొనుగోలుపై ఆసక్తి చూపుతారు. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన అధికం అవుతుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే.. ఆదివారం ఇలా చేస్తే?