మేషం :- పత్రిక, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. రాజకీయాలలో వారికి తగిన గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రుణాలు తీరుస్తారు. ఓర్పు, మంచితనంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లకు చికాకులను ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలలో సఫలీకృతులవుతారు.
వృషభం :- అధికారులు ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. దైవ సేవా కార్యక్రమాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాణిజ్య ఒప్పందాలు, లీజు, ఏజెన్సీల వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. కేటరింగ్ రంగాల్లో పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మిథునం :- వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఆటుపోట్లు, చికాకులు ఎదుర్కుంటారు. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించటం మంచిది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదవకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
కర్కాటకం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. మీ విలువైన వస్తువులు ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురికాకండి. పాత మిత్రులను కలసుకుంటారు. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారు. స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు ఫలిస్తాయి.
సింహం :- వైద్యులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. విద్యార్థులకు కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. రావలసిన ధనం రావడంతో బాకీలు తీరుస్తారు. వాహనం కొనుగోలు చేయు ప్రయత్నాలలో జయం.
కన్య :- హోటల్, తినుబండారాలు, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నిర్లక్ష్యంగా వాహనం నడపటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. అయినవారి నుంచి అభిమానాన్ని, ప్రేమను మరింత పొందుతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
తుల :- ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేసే విషయంలో తోటివారి సహకారం లభిస్తుంది. ప్రతి విషయంలోను స్వయంశక్తినే నమ్ముకోవటం మంచిది. రిప్రజెంటేటివ్‌లు, వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. విద్యార్ధులకు అధ్యాపకులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని విషయాల్లో కుటుంబంలో ఆధిపత్యం చెల్లదు.
వృశ్చికం :- వృత్తి ఉద్యోగాల్లో ఏ మార్పు లేకపోవటంతో అశాంతికి లోనవుతారు. విద్యుత్ రంగాలల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ట్రాన్సుపోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. స్త్రీలకు కళ్ళు, తల, నారలకు సంబంధించిన చికాకులు తప్పవు.
ధనస్సు :- రాజకీయాలవారు కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. పట్టుదలతో శ్రమించినగాని అనుకున్నది సాధించలేరు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రముఖుల సిఫార్సుతో పనులు సానుకూలమవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్త్రీలు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి చూపుతారు.
మకరం:- స్త్రీలకు కళా రంగాలపట్ల, వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. వాహనం ఇతరులకుఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో గృహంలో అసౌకర్యానికి గురవుతారు. చెల్లింపులు, కరెన్నీ నోట్ల విషయంలో జాగ్రత్తఅవసరం.
కుంభం :- దుబారా ఖర్చులు అదుపు సాధ్యం కాదు. స్త్రీల ఏమరుపాటు తనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతోచికాకు కలిగిస్తుంది. మీ సమస్యలకు చక్కని పరిష్కారం గోచరిస్తుంది. విద్యార్ధినుల మొండితనం అనర్థాలకు దారితీస్తుంది.
మీనం :- వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన స్కీంలు మంచి ఫలితాలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు హోదా పెరగటంతో పాటు బరువు బాధ్యతలు అధికమవుతాయి. వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. కోర్టు వ్యాజ్యాలు, కేసులు పరిష్కార దిశగా సాగుతాయి.