Webdunia - Bharat's app for daily news and videos

Install App

26-11-2024 మంగళవారం ఫలితాలు - మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

రామన్
మంగళవారం, 26 నవంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఖర్చులు సామాన్యం. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది. అపరిచితులతో మితంగా సంభాషించండి. విందులకు హాజరవుతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ సమస్యలు తొలగి తాకట్టు విడిపించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అధికం. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. వ్యవహారాల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. దైవకార్యానికి వ్యయం చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పనులు పురమాయించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సమర్ధతకు గుర్తింపు ఉండదు. అందరితోనూమితంగా సంభాషించండి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అనవసర జోక్యం తగదు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. అన్యమస్కంగా గడుపుతారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. దంపతల మధ్య అకారణ కలహం. పోగొట్టుకున్న పత్రాలు తిరిగా పొందుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. దూర ప్రయాణం కలిసివస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పనులతో తీరిక ఉండదు. రోజువారీ ఖర్చులుంటాయి. పెట్టుబడుల విషయం పునరాలోచించండి. అప్రియమైన వార్త వినవలసిన వస్తుంది. ఆధ్మాత్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. దైవ, సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. సోదరులతో సంభాషిస్తారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. సమర్ధతకు గుర్తింపు ఉండదు. యత్నాలు కొనసాగించండి. వ్యవహారాలతో తలమునకలవుతారు. అవకాశాలను చేజార్చుకుంటారు. పత్రాలు సమయానికి కనిపించవు. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు వేగవంతమవుతాయి. ఆలయాలు, సేవాసంస్థలకు విరాళాలు అందిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

తర్వాతి కథనం
Show comments