Webdunia - Bharat's app for daily news and videos

Install App

26-06-2024 బుధవారం దినఫలాలు - లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి...

రామన్
బుధవారం, 26 జూన్ 2024 (04:00 IST)
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట ఐ॥ పంచమి రా.11.08 ధనిష్ఠ ప.3.50 రా.వ.10.30 ల 11.59. ప.దు. 11.31 ల 12.23.
 
మేషం :- వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. మీ అంతరంగిక సమస్యలకు పరిష్కారం కానరాదు. రావలసిన ధనం వసూలులో కొంతమేరకు చేతికందుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
వృషభం :- వైద్య, ఇంజనీరింగ్ రంగంలో వారికి మెళుకువ అవసరం. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. పత్రికా రంగంలోని వారికి కళాకారులకు రచయితలకు అనువైన సమయం. బంధు మిత్రుల రాకపోకలు అధికం. మందులు, ఎరువులు, రసాయన, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు.
 
మిథునం :- సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు సామాన్యం. ఉమ్మడి వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం. కార్యసిద్ధికి ఓర్పు, పట్టుదలతో శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కర్కాటకం :- ఆలయాలను సందర్శిస్తారు. చిట్స్, ఫైనాన్సు రంగాల వారు మొండిబకాయిల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయికతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. దైనందిన కార్యక్రమాల్లో ఎటువంటి మార్పులుండవు.
 
సింహం :- అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలుంటాయి. అవివాహితులలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. నిరుద్యోగులు ఏ చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రైవేట్ సంస్థల వారికి ఓర్పు ప్రధానం.
 
కన్య :- ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచనస్ఫురిస్తుంది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు, మొండితనం చికాకు కలిగిస్తాయి. పానీయ చిరువ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు టివి ఛానెళ్ళ నుంచి ఆహ్వానం, పత్రికల నుంచి పారితోషికం అందుతుంది. మీసంతానం పై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.
 
తుల :- ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ఆప్తులకు ప్రియమైన వస్తువులు అందజేస్తారు.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. మీ ఏమరుపాటు వల్ల విలువైన వస్తువులు చేజార్చుకుంటారు. మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు, కార్యకలాపాలు విస్తరిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత కొరవడుతుంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
ధనస్సు :- తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదుర్కుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. పొదుపు పాటించే విషయంలో కుటుంబీకుల నుంచి వ్యతిరేకత, సన్నిహితుల అవహేళనలు ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.
 
మకరం :- ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. స్త్రీలు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవాలనే తాపత్రయం అధికమవుతాయి.
 
కుంభం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. పెద్దవారిలో మందకొడితనం అధికమవుతుంది. రియల్ ఎస్టేట్ వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలకు ఇతరుల వాహనం నడపటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. 
 
మీనం :- నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. మనోబలంతో యత్నాలు సాగించండి. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచాలి. తలపెట్టిన పనిలో అవాంతరాలు ఎదుర్కొంటారు. మీ వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

లేటెస్ట్

31-08-2002 నుంచి 06-09-2025 వరకు మీ వార ఫలితాలు

31-08-2025 ఆదివారం రాశిఫలాలు - ఖర్చులు అధికం.. ప్రయోజనకరం...

30-08-2025 శనివారం ఫలితాలు - పిల్లల దూకుడును అదుపు చేయండి.

గణపతి ఉత్సవాల కోలాహలం: మంగళహారతి పాడుదాం రండి

Saturday Saturn Remedies: శనివారం నల్లనువ్వులు, ఆవనూనెతో ఇలా చేస్తే.. రావిచెట్టులో శనిగ్రహం..?

తర్వాతి కథనం
Show comments