Webdunia - Bharat's app for daily news and videos

Install App

25-12-2024 బుధవారం దినఫలితాలు : అనుకున్న లక్ష్యం సాధిస్తారు...

రామన్
బుధవారం, 25 డిశెంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఆప్తులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆప్తులను కలుసుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణం విరమించుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రోజువారీ ఖర్చులే ఉంటాయి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యానుకూలత ఉంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అనవసర జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆర్థికలావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. పనులు వేగవంతమవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు సద్దుమణుగుతుంది. మానసికంగా స్థిమితపడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్‌ప్రభావం చూపుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు.. ఖర్చులు విపరీతం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. అయిన వారికి సాయం అందిస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
చాకచక్యంగా వ్యవహరించాలి. ప్రతికూలతలు అధికం. అవకాశాలు చేజారిపోతాయి. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. ఖర్చులు విపరీతం. రుణ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడండి. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు విపరీతం. నిస్తేజానికి లోనవుతారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కృషి ఫలించకున్నా యత్నించామన్న తృప్తి ఉంటుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments