Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

Astrology

రామన్

, శనివారం, 21 డిశెంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లావాదేవీలతో తీరిక ఉండదు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ప్రముఖుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు ముందుకు సాగవు. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరులను సంప్రదిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. మీ ప్రమేయంతో ఒకరికి మేలు జరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పొదుపు ధనం అందుతుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. పరిచయాలు బలపడతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయుల ప్రోత్సాహం కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సాయం ఆశించవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు సానుకూలమవుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అనురాగవాత్యల్యాలు వెల్లివిరుస్తాయి. అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అప్రమత్తంగా ఉండాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. లౌక్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఒంటెద్దుపోకడ తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. యత్నాలను ఆప్తులు ప్రోత్సాహిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పోగొట్టుకున్న పత్రలు లభ్యమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు సామాన్యం. పిల్లల కృషి ఫలిస్తుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు పురమాయించవద్దు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సమస్యలను నిబ్బరంగా ఎదుర్కుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. వాయిదాల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. భేషజాలకు పోవద్దు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. పత్రాలు అందుకుంటారు. కొత్త పరిచయాలు బలపడతాయి. ప్రయాణం తలపెడతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం