Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

Advertiesment
horoscope

రామన్

, గురువారం, 19 డిశెంబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యం నెరవేరుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీల్లో తప్పటడుగు వేస్తారు. మీ మాటతీరు అపోహాలకు దారితీస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. నోటీసులు అందుకుంటారు. పెద్దల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. లావాదేవీలతో తీరిక ఉండదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రుణ సమస్యలు తొలగుతాయి. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. శ్రమకు తగిన ఫలితాలున్నాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. కొత్తవారితో మితంగా సంభాషించండి. ఆహ్వానం అందుకుంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహారానుకూలత ఉంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. అవతలి వారి స్తోమతు తెలుసుకోండి. ప్రయాణంలో అవస్ధలెదుర్కుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ సామార్థ్యంపై నమ్మకం పెంచుకోండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పిల్లల భవిష్యత్తుపై దృష్టిసారిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహారాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇవ్వొద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమయస్ఫూర్తిగా మెలగండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అధికం, నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. సన్నిహితులతో సంభాషిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శ్రమించినా ఫలితం ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. చేపట్టిన పనులు అర్థాంతగా ముగించవలసి వస్తుంది. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఇంటి విషయాలపై దృష్టిపెట్టండి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. విలాసాలకు వ్యయం చేస్తారు. ధనసహాయం తగదు. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. ముఖ్యులను కలుసుకుంటారు. విందులో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పట్టుదలతో యత్నాలు సాగించండి. స్వయంకృషితోనే కార్యాన్ని సాధిస్తారు. ప్రియతముల వ్యాఖ్యలు కార్మోన్యుఖులను చేస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఖర్చులు విపరీతం. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు