Webdunia - Bharat's app for daily news and videos

Install App

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

రామన్
మంగళవారం, 22 జులై 2025 (04:00 IST)
మేషం: : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. బంధువులతో పట్టింపులు ఎదురవుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పొదుపు ధనం అందుకుంటారు. పనుల్లో శ్రమ అధికం. పోగొట్టుకున్న పత్రాలు తిరిగా సంపాదిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఖర్చులు సామాన్యం. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. వాహనం ఇతరుకివ్వవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
లావాదేవీలతో సతమతమవుతారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. మీ చిత్తశుద్ధి ఎదుటివారికి కనువిప్పు కలిగిస్తుంది. బంధుత్వాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
శ్రమించినా ఫలితం ఉండదు. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ఓర్పుతో మెలగండి. స్థిరాస్తి ధనం అందుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శుభకార్యం తలపెడతారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. నగదు, వెండి, బంగారాలు జాగ్రత్త. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పెద్దల సలహా పాటిస్తారు. పనులు వేగవతంతమవుతాయి. సోదరుల వైఖరి అసహనం కలిగిస్తుంది. పట్టింపులకు పోవద్దు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. గుట్టుగా వ్యవహరించండి. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహార దక్షతతో రాణిస్తారు. ప్రముఖులతో పరిచలు ఏర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. విలువైన వస్తువులు జాగ్రత్త. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు..
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

21-07-2025 సోమవారం దినఫలితాలు - పందాలు, బెట్టింగుకు దూరంగా ఉండండి...

Daily Astrology: 20-07-2025 ఆదివారం ఫలితాలు-కష్టపడినా ఫలితం ఉండదు.. ఓర్పుతో?

Weekly Horoscope: 21-07-2025 నుంచి 27-07-2025 వరకు వార ఫలితాలు

Pothuraju: హైదరాబాద్‌లో బోనాలు - పోతురాజు అలంకరణ ఎలా జరుగుతుంది.. నిష్ట నియమాలేంటి? (video)

19-07-2025 శనివారం దినఫలితాలు - ఏకాగ్రతతో యత్నం సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments