Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

రామన్
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (08:18 IST)
మేషం :- ఆడిట్, అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేక ప్రత్యేక ఇంక్రిమెంట్ లభించగలదు. భాగస్వామిక చర్చలు, సంప్రదింపులకు అనుకూలం. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. స్త్రీలకు వస్తులాభం, వాహనయోగం వంటి శుభపరిణామాలున్నాయి.
 
వృషభం :- ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా మీ నిర్ణయాలు, కార్యక్రమాలు మార్చుకోవలసి ఉంటుంది. కుటుంబీకుల కోరికలు తీరుస్తారు. ముఖ్యుల గురించి ఆందోళన చెందూరు. వృత్తి వ్యాపారాల్లో చికాకులు తొలగిపోగలవు. పన్నులు, రుణవాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. 
 
మిథునం :- దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. రాబడికి మించిన ఖర్చులెదురైనా సమయానికి కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తరచూ వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరచరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కర్కాటకం :- కీలకమైన సమస్యలు పరిష్కారం కావటంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు అధికారుల తనిఖీలు, ఇతరత్రా చికాకులు తప్పవు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టుర్లు, బిల్డర్లకు స్వీయ పర్యవేక్షణ ముఖ్యం. స్త్రీలకు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. 
 
సింహం :- పత్రికా సంస్థలలోని వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. మీ ఆతిథ్యం, ఆదరణ ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. విద్యార్థినుల్లో మానసిక ధైర్యం నెలకొంటుంది.
 
కన్య :- వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ యత్నాలకు కుటుంబీకులు సహకారం అందిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రాబడి, ఖర్చుల విషయంలో మెళకువ వహించండి. కొంతమంది మీ నుంచి ధనం లేక ఇతరత్రా సహాయం అర్థిస్తారు.
 
తుల :- అక్కౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు ఆత్మీయుల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. ఏ వ్యవహారంలోను ఇతరులపై అతిగా ఆధారపడటం మంచిదికాదు.
 
వృశ్చికం :- వృత్తి వ్యాపారులకు అన్నివిధాలా అనుకూలం. ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ఏకాగ్రత అవసరం. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. కీలక నిర్ణయాలు, హామీల విషయంలో పునరాలోచన అవసరం.
 
ధనస్సు :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి పని ఒత్తిడి అధికం. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఆకస్మిక చెల్లింపులు, అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. కొత్త సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది.
 
మకరం :- ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. వాహనం నడుపుతున్నపుడు మెళకువ వహించండి. సర్దుబాటు ధోరణితో వ్యవహరించి కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. విద్యార్థుల్లో రేపటి గురించి ఆందోళన అధికమవుతుంది.
 
కుంభం :- విందులు, వేడుకల్లో మితంగా వ్యవహరించండి. కొంత ఆలస్యమైనా అనుకున్న పనులు ఆశించిన విధంగా పూర్తి చేస్తారు. ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. ప్రతి విషయంలోను బాధ్యతగా మెలుగుతారు. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లకు తమ గుమాస్తాల వల్ల చికాకులుతప్పవు.
 
మీనం :- ఒకానొక వ్యవహారంలో మీరు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్నిస్తుంది. మీ వ్యాపారాలు, సంస్థలలో కొత్త వారిని చేర్చుకునే విషయంలో పునఃపరిశీలన అవసరం. ఉద్యోగస్తులకు త్వరలో శుభవార్తలు అందుతాయి. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. స్త్రీలకుసంపాదన, విలాసాల పట్ల మక్కువ పెరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బైక్‌తో పాటు బావిలో దూకేసిన వ్యక్తిని రక్షించబోయి.. నలుగురు మృతి

ట్యూషన్‌కు వచ్చే బాలుడితో 23 యేళ్ళ యువతి ప్రేమ...

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

అన్నీ చూడండి

లేటెస్ట్

డిసెంబరు 29 నుంచి జనవరి 04 వరకు మీ వార ఫలితాలు

Somvati Amavasya 2024 సోమాతి అమావాస్య.. చెట్లను నాటండి.. ఈశాన్య దిక్కులో నేతి దీపం..

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న శ్రీశైలం

29-12-2024 ఆదివారం దినఫలితాలు -రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి...

శనివారం ప్రదోషం: సాయంత్రం పాలు, పెరుగు అభిషేకానికి సమర్పిస్తే?

తర్వాతి కథనం
Show comments